RRR Update: ఆర్‌.ఆర్‌.ఆర్‌ నుంచి రామ రాజు లుక్ వచ్చేసింది.. చెర్రీ సిక్స్‌ ప్యాక్‌ బాడీ చూస్తే..

RRR Update: ఆర్‌.ఆర్‌.ఆర్‌ నుంచి రామ రాజు లుక్ వచ్చేసింది.. చెర్రీ సిక్స్‌ ప్యాక్‌ బాడీ చూస్తే..
Rrr

RRR Update: దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తోన్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రానికి సంబంధించి ఒక్కో అప్‌డేట్‌ వచ్చేస్తోంది. ఇప్పటికే చిత్రంలోని ఎన్టీఆర్‌ పాత్రను పరిచయం చేసిన చిత్రయూనిట్ తాజాగా రామ్‌ చరణ్‌ లుక్‌ను..

Narender Vaitla

|

Dec 06, 2021 | 4:30 PM

RRR Update: ఒక్క టాలీవుడ్ మాత్రమే కాకుండా యావత్‌ భారతీయ సినీ పరిశ్రమ ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాకోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌, తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి సినిమాను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కానీ సెకండ్‌ వేవ్‌ తర్వాత కరోనా కాస్త గ్యాప్‌ ఇవ్వడంతో జక్కన్న శరవేగంగా చిత్రాన్ని పూర్తి చేశారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలోనే సినిమా తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే డిసెంబర్‌ 9న సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. అయితే అంతకు ముందే ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌లు ఇస్తోంది మూవీ యూనిట్ ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ను విడుదల చేసిన ఆర్‌.ఆర్‌.ఆర్‌ మూవీ యూనిట్ తాజాగా.. రామ్‌ చరణ్‌ కొత్త లుక్‌ను కూడా విడుదల చేసింది. రామ్‌చరణ్‌ ఈ సినిమాలో అల్లూరి సీతరామ రాజు పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో రామ్‌చరణ్‌ లుక్‌..

Rrr Movie

తాజాగా విడుదల చేసిన ఫోటోలో ఆక్రోశంతో కనిపిస్తున్న రామ్‌చరణ్‌ చరణ్‌ విశ్వరూపం కనిపిస్తోంది. కండలు తిరిగిన శరీరంతో, సిక్స్‌ ప్యాక్‌ బాడీలో చెర్రీ అదరగొడుతున్నారు. దీంతో ఈ ఫోటో చూసిన ఆయన ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ఇక లుక్‌లతోనే ఇంతలా సెన్సేషన్‌ క్రియేట్‌ అవుతుంటే ఇక ట్రైలర్‌ వచ్చాక ఎలాంటి రచ్చ ఉంటుదో చూడాలి. నిజానికి ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది.కానీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ వాయిదా వేశారు. ఆ తర్వాత డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చేయనున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక సోమవారం ఉదయం విడుదల చేసిన ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌లో రక్తంతో తడిచిన శరీరంతో రెండు చేతులతో తాడులను లాగుతూ ఆగ్రహంతో ఉన్నాడు తారక్‌. ఇక ఎన్టీఆర్ కొమురం భీమ్ లేటేస్ట్ పోస్టర్ అదిరిపోయిందంటూ తారక్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో ఎన్టీఆర్ లుక్‌..

Ntr

Also Read: Post Paid Plans: ఎయిర్‌టెల్..వోడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్.. పెరగనున్న ప్లాన్ టారిఫ్‌లు!

Atal Tunnel Accident: అటల్‌ టన్నెల్‌లో అదుపు తప్పిన కారు.. వేగంగా ప్రయాణిస్తూ గోడను ఢీకొట్టి.. షాకింగ్ వీడియో..

Twitter Audio: ఇకపై ట్వీట్లను చదవడమే కాదు, వినొచ్చు కూడా.. సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్న ట్విట్టర్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu