Remo D’souza on Salman Khan : స‌ల్మాన్ నేను పెద్ద‌గా మాట్లాడుకుంది లేదు.. కానీ నా కోసం ఆయన..

ఈ నెల ప్రారంభంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో

Remo Dsouza on Salman Khan : స‌ల్మాన్  నేను పెద్ద‌గా మాట్లాడుకుంది లేదు.. కానీ నా కోసం ఆయన..

Updated on: Dec 31, 2020 | 3:54 PM

Remo D’Souza on Salman Khan : ఈ నెల ప్రారంభంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనకు ముంబై లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందించారు. రెమోకు గుండెపోటు రావడంతో ఆయన అభిమానులంతా చాలా కంగారు పడ్డారు. కాగా ఇటీవలే ఆయన కోలుకున్నారు. రెమో హెల్త్ అప్డేట్స్ ను ఆయన భార్య ఎప్పటికప్పుడు అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందించారు.

రెమో డిసౌజా ఆసుప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో ఆందోళనకు గురైన రెమో భార్య లిజెల్‌కు స‌ల్మాన్ ఖాన్  అండగా ఉన్నారు. ఆమెలో ధైర్యాన్ని నింపారు. ఈ విష‌యాన్ని లిజెల్ తన సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. తాజాగా రెమో తన కు సల్మాన్ చేసిన సాయం గురించి చెప్పుకొచ్చాడు. 2018లో స‌ల్మాన్‌తో క‌లిసి ‘రేస్ 3’ అనే చిత్రం తెరకెక్కించాను. సల్మాన్ చాలా గొప్ప హృదయం ఉన్న వ్యక్తి. అత‌నిని మేము దేవ‌దూత అని పిలుస్తాము. స‌ల్మాన్ , నేను పెద్ద‌గా మాట్లాడుకుంది లేదు. అవును సార్, ఓకే సార్ ఇలాంటి మాట‌లే మా మ‌ధ్య న‌డిచేవి. నా భార్య లిజెల్‌ మాత్రం స‌ల్మాన్‌కు చాలా క్లోజ్. నేను ఆసుప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో ఆమె స‌ల్మాన్ సాయాన్ని కోరింది. వెంట‌నే స్పందించినన ఆయన వైద్యుల‌తో మాట్లాడారు. ఆరు రోజుల పాటు నాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బరిచారు అని చెప్పుకొచ్చాడు రెమో.

also read : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్.. తనతో టచ్‌లో ఉన్నవారు కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని హితవు..

Loading...
Unable to load recommendations.
Follow Us