సైబర్ మోసాలు జరిగితే బాధితులకు బ్యాంకులే డబ్బులు చెల్లించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఖాతాలను రక్షించడం బ్యాంకు ప్రాథమిక బాధ్యత అని సీజేఐ సూర్యకాంత్ ధర్మాసనం పేర్కొంది. బ్యాంకు నిర్లక్ష్యం వల్ల మోసం జరిగితే పూర్తి నష్టాన్ని బ్యాంకే భరించాలి. అనుమానాస్పద లావాదేవీలను వెంటనే గుర్తించి ఆపాలని ఆదేశించింది.