వీడిన ‘నిశ్శబ్దం’.. రిలీజ్ డేట్ చెప్పేసిన టీమ్‌

గత కొన్నిరోజులుగా ఉన్న 'నిశ్శబ్దం'కు తెర పడింది. అనుష్క నటించిన థ్రిల్లర్‌కి రిలీజ్‌ డేట్ ఫిక్స్ అయ్యింది

వీడిన నిశ్శబ్దం.. రిలీజ్ డేట్ చెప్పేసిన టీమ్‌

Updated on: Sep 18, 2020 | 6:03 PM

Anushka Nishabdham release date: గత కొన్నిరోజులుగా ఉన్న ‘నిశ్శబ్దం’కు తెర పడింది. అనుష్క నటించిన థ్రిల్లర్‌కి రిలీజ్‌ డేట్ ఫిక్స్ అయ్యింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న నిశ్శబ్దం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ మేరకు మూవీ యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది. అటు అమెజాన్ ప్రైమ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ”మీ నిశ్శబ్దం మిమ్మల్ని కాపాడుతుంది. తెలుగు, తమిళ్‌, మలయాళంలో అక్టోబర్ 2న నిశ్శబ్దం ప్రీమియర్ అవ్వనుంది” అని వెల్లడించింది.

కాగా ఈ థ్రిల్లర్ సినిమాలో అనుష్క మూగ ఆర్టిస్ట్‌గా నటించగా.. ఆమె సరసన మాధవన్ మ్యుజిషియన్‌గా కనిపించనున్నారు. అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కోన వెంకట్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు. ఇప్పటికే టీజర్‌లతో ఆకట్టుకున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

Bigg Boss 4: గంగవ్వ అభ్యర్థన.. డైలమాలో అభిమానులు

సుశాంత్ మైనపు బొమ్మ తయారీ.. కీలక వ్యాఖ్యలు చేసిన కళాకారుడు

Loading...
Unable to load recommendations.
Follow Us