Krack Movie Making : రవితేజ ‘క్రాక్’ సెట్ లో మురగదాస్ సందడి.. మేకింగ్ వీడియో విడుదల చేసిన టీమ్..

|

Jan 07, 2021 | 2:53 PM

మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రాక్ సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న..

Krack Movie Making : రవితేజ క్రాక్ సెట్ లో మురగదాస్ సందడి.. మేకింగ్ వీడియో విడుదల చేసిన టీమ్..
Follow us on

Krack Movie Making : మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రాక్ సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ర‌వితేజ‌-గోపీచంద్ ఇద్ద‌రూ ఫైట్ మాస్ట‌ర్స్ తో డిష్క‌ష‌న్స్ చేయ‌డం, వారి సూచ‌న‌లు ఫాలో కావ‌డం, లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి ఇత‌ర టీం మెంబ‌ర్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు . స్టార్ డైరెక్టర్ మురగదాస్ క్రాక్ సెట్ లో సందడి చేశారు. ఇవన్నీ మేకింగ్ వీడియోలో చూపించారు. విడుదలకు రెండు రోజుల ముందే  మేకింగ్ వీడియో విడుద‌ల చేసి ర‌వితేజ అభిమానుల్లో మ‌రింత ఉత్సాహాన్ని నింపుతున్నారు మేక‌ర్స్. యూఎస్ లోని ప‌లు లొకేష‌న్ల‌లో ఒక రోజు ముందే జ‌న‌వ‌రి 8న క్రాక్ ను విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా విజయం పై చిత్రయూనిట్ తో పాటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.