టాలెంటెడ్ డైరెక్టర్‌తో రానా.. అధికారిక ప్రకటన

దగ్గుబాటి రానా మరో సినిమాను కన్ఫర్మ్ చేశారు. మూడేళ్ల క్రితం సిద్దార్థ్‌తో 'ద హౌస్ నెక్ట్ డోర్'‌(తెలుగులో గృహం)ను తెరకెక్కించి

టాలెంటెడ్ డైరెక్టర్‌తో రానా.. అధికారిక ప్రకటన
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2020 | 5:19 PM

Rana Daggubati Next: దగ్గుబాటి రానా మరో సినిమాను కన్ఫర్మ్ చేశారు. మూడేళ్ల క్రితం సిద్దార్థ్‌తో ‘ద హౌస్ నెక్ట్ డోర్’‌(తెలుగులో గృహం)ను తెరకెక్కించి సర్వత్రా ప్రశంసలు అందుకున్న మిలింద్ రావ్ దర్శకత్వంలో రానా నటించబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

సూపర్‌నాచురల్‌ యాక్షన్ అడ్వంచెర్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ బాషల్లో తెరకెక్కించబోతుండగా.. సురేష్‌ ప్రొడక్షన్స్‌, గోపినాధ్ అచంట సంయుక్తంగా నిర్మించనున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ కాస్త ఎక్కువగానే ఉండబోతున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. కాగా ప్రస్తుతం రానా, వెంకీ ఊడుగుల దర్శకత్వంలో విరాట పర్వంలో నటిస్తున్నారు. ఇక ఆయన నటించిన హాథీ మేరీ సాథీ(తెలుగులో అరణ్య) విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు 1945, హిరణ్య కశ్యప చిత్రాల్లో రానా నటించనున్నారు.

Read More:

అపాయింట్‌మెంట్‌ కోరా.. జగన్‌ని కలుస్తా: బాలయ్య

జనవరి 1 నుంచి సమగ్ర భూసర్వే చేపట్టండి: జగన్