Ramyakrishna: ‘రిపబ్లిక్’ షూటింగ్ కంప్లీట్ చేసిన శివగామి.. రాజకీయ నేపథ్యంలో సినిమా.. విడుదల ఎప్పుడంటే..

Ramyakrishna: టాలీవుడ్‌లో స్టార్ నటి రమ్యకృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు హీరోయిన్‌గా పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన

Ramyakrishna: రిపబ్లిక్ షూటింగ్ కంప్లీట్ చేసిన శివగామి.. రాజకీయ నేపథ్యంలో సినిమా.. విడుదల ఎప్పుడంటే..

Updated on: Feb 05, 2021 | 8:48 AM

Ramyakrishna: టాలీవుడ్‌లో స్టార్ నటి రమ్యకృష్ణకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు హీరోయిన్‌గా పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన రమ్యకృష్ణ ప్రస్తుత జనరేషన్‌లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సినిమాలలో కీలకమైన క్యారెక్టర్ చేయడం కాదు.. పలు పాత్రలే ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయంటే అతిశయోక్తికాదు. తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘రిపబ్లిక్’. దేవకట్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో రమ్యకృష్ణ ఒక కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటితో ఆమె తన పాత్ర తాలూకు షూటింగ్ ముగించేశారు. ఈ విషయాన్నే ట్విట్టర్ ద్వారా తెలిపిన దేవకట్ట దేవతతో పనిచేయడం గొప్పగా ఆనందంగా ఉందని, సినిమాలో భాగమైనందుకు రమ్యకృష్ణగారికి కృతజ్ఞతలని చెప్పుకొచ్చారు. రాజకీయాల నేపథ్యంలో ఆయన చేస్తున్న సినిమా కావడంతో ‘రిపబ్లిక్’ మీద మంచి అంచనాలున్నాయి. అంతేకాకుండా పొలిటికల్‌ అంటే శివగామి ఏ రేంజ్‌లో నటిస్తుందో ప్రేక్షకులందరికి తెలుసు. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ కథానాయకిగా నటిస్తుండగా సీనియర్ నటుడు జగపతిబాబు కూడ ఒక కీ రోల్ చేస్తున్నారు. జె.భగవాన్, పుల్లారావ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఆ తమిళ నటుడి హిందీ సినిమా షూటింగ్ షురూ.. మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ ప్రాజెక్ట్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..