
టాలీవుడ్ లో ప్రస్థానం మొదలు పెట్టి.. ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ స్థాయికి చేరారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ప్రతీ విషయంపైనా తనదైన శైలిలో స్పందించగల దమ్మున్న రాము తన జీవిత ప్రస్థానాన్ని మూడు భాగాలుగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా పార్ట్1 సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను వర్మ రిలీజ్ చేశారు. కాగా, నిన్న ఈ మూవీకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో వర్మ జీవితం తెరకెక్కబోతోంది. మొత్తంగా ఆర్జీవీ నిజ జీవితాన్ని 3 సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. ఒక్కొక్క సినిమా నిడివి సుమారు 2 గంటలుంటుంది. అంటే 3 చిత్రాలు కలిపి మొత్తం 6 గంటలు. బొమ్మాకు మురళి నిర్మాణంలో రాంగోపాల్ వర్మ ఆధ్వర్యంలో ‘దొరసాయి తేజ’ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.