వలలో చిక్కిన వయ్యారి చేప.. ఆనందంలో జాలరి

Updated on: Nov 20, 2025 | 4:04 PM

తమిళనాడులోని రామనాథపురం జిల్లా పాంబన్‌లో జాలర్లకు అరుదైన ఎల్లోఫిన్ టూనా చేప చిక్కింది. 112 కిలోల బరువు, 3 మీటర్ల పొడవున్న ఈ భారీ చేపను మత్స్యకారులు మన్నార్ గల్ఫ్‌లో పట్టుకున్నారు. మార్కెట్‌లో దీనిని రూ.17 వేలకు వేలం వేయగా, కేరళ వ్యాపారి కొనుగోలు చేశారు. ఇటువంటి భారీ చేపలు అరుదుగా చిక్కుతాయని జాలర్లు తెలిపారు.

సముద్రంలో వేటకు వెళ్లిన జాలరులకు అరుదైన చేప చిక్కింది. సుమారు 112 కిలోల బరువు, 3 మీటర్ల పొడవు ఉన్న ఈ చేపను మార్కెట్లో వేలం వేయగా భారీ ధర పలికింది. ఈ సంఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా పాంబన్‌లో జరిగింది. రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం ప్రాంతంలో కంట్రీ బోట్‌లో కొందరు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. మన్నార్‌ గల్ఫ్‌ వద్ద వేట సాగిస్తుండగా వారి వలకు అరుదైన టూనా చేప చిక్కింది. ఇది లోతైన సముద్రంలో మాత్రమే కనిపిస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ పసుపు రెక్కల టూనా చేప సుమారు 112 కిలోల బరువు, 3 మీటర్ల పొడవు ఉంది. దీన్ని కేరళకు చెందిన ఓ వ్యాపారి రూ.17 వేలకు కొనుగోలు చేశారు. రామేశ్వరం సముద్రం స్టార్ ఫిష్, సముద్ర తాబేళ్లు, డాల్ఫిన్లు, తిమింగలాలు, సముద్రపు పాచి వంటి వివిధ రకాల అరుదైన సముద్ర జీవులకు నిలయం. కాగా, హిందూ మహాసముద్రంలో చాలా లోతైన ప్రాంతాలలో ఈ చేపలు కనిపిస్తాయి. ఇటువంటి భారీ చేపలు వలలో చిక్కుకోవడం చాలా అరుదు అని మత్స్యకారులు చెబుతున్నారు. ఇక ఈ అరుదైన ఎల్లో టూనా చేపను చూడటానికి స్థానికులు పెద్ద సంఖ్యలో గుమి గూడారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఢిల్లీ ఎర్రకోట పేలుడు.. సూసైడ్ బాంబర్ షూలోనే ట్రిగ్గర్ ??

పైరసీకి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే.. ఆ పని చేయాల్సిందే..

అల్లు అర్జున్‌తో పోటీ.. పృథ్విరాజ్‌ సుకుమారన్‌ ఏమన్నారు ??

Rajamouli: ఇంటర్నేషనల్‌ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన జక్కన్న.. మరీ ఇంత అడ్వాన్స్ గానా

సిల్వర్ స్క్రీన్ మీద రిపీట్‌ అవుతున్న జోడీలు.. మళ్లీ కుదురుతున్నట్టేనా ??