Ramayana Collections : బాక్సాఫీస్ వద్ద రామాయణం విధ్వంసం.. కేవలం ఆరు రోజుల్లోనే కలెక్షన్ల ఊచకోత..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా 'రామాయణం పార్ట్ 1'. ప్రస్తుతం ఈ మూవీ వసూళ్ల పరంగా అద్భుతాలు సాధిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణాసురుడిగా నటిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Ramayana Collections : బాక్సాఫీస్ వద్ద రామాయణం విధ్వంసం.. కేవలం ఆరు రోజుల్లోనే కలెక్షన్ల ఊచకోత..
Ramayana: Part 1

Updated on: Nov 11, 2026 | 1:03 PM

భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం రామాయణం బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, ఊహించని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ ఈ చిత్రం సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది. తాజాగా సినిమా విడుదలైన ఆరో రోజు కలెక్షన్లకు సంబంధించిన బాక్సాఫీస్ ఫలితాలు ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్‌ను దాటేసి దూసుకుపోతోంది. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. వీకెండ్‌తో సంబంధం లేకుండా వర్కింగ్ డేస్‌లోనూ థియేటర్ల వద్ద ప్రేక్షకుల తాకిడి తగ్గలేదు. ముఖ్యంగా నైజాం, ఆంధ్రా ప్రాంతాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లు సాధిస్తూ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ట్రేడ్ పండితులు అంచనా వేసిన దానికంటే రెట్టింపు వేగంతో ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతోంది.

ఈ చిత్రంలో అగ్ర తారాగణం నటించడం, అత్యుత్తమ సాంకేతిక విలువలు, విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. రామాయణ గాథను నేటి తరానికి తగినట్లుగా అత్యంత అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడు నితీష్ తివారీ నిర్మాణ బృందం సఫలమయ్యారనే ప్రశంసలు వస్తున్నాయి. రామనామ స్మరణతో థియేటర్లు మార్మోగుతుండగా, ఫ్యామిలీ ఆడియన్స్ సైతం పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివస్తున్నారు. రాబోయే వీకెండ్‌లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని, త్వరలోనే ఈ చిత్రం వే కోట్ల క్లబ్‌లో సులభంగా చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తొలి 6 రోజుల్లో భారతదేశం వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం రూ. 440.45 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. కేవలం దేశీయంగానే కాకుండా ఓవర్సీస్‌లోనూ ‘రామాయణం’ తన జోరును కొనసాగిస్తోంది. అంతర్జాతీయంగా తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, నార్త్ అమెరికాలో మొదటి సోమవారమే 1.37 మిలియన్ డాలర్లు రాబట్టి సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ‘దంగల్’, ‘డంకీ’ వంటి భారీ చిత్రాల హాలిడే వసూళ్లను సైతం అధిగమించి, గతంలో ఉన్న రికార్డుల కంటే 20.2% అధిక వసూళ్లను సాధించింది. మరోవైపు బుక్‌మైషోలో గంటకు ఏకంగా 95 వేల నుంచి 1.40 లక్షల వరకు టికెట్లు అమ్ముడవుతూ పోస్ట్-పాండమిక్ రికార్డులను ఈ సినిమా తిరగరాస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us