Ram Charan Recovers : కరోనాను జయించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. త్వరలో షూటింగ్ లో పాల్గొంటానని ట్వీట్

రోనా వైరస్ సామాన్యులు, ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరినీ వణికించేస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారు అయితే ఏడాది క్రితం కంటే ఇప్పడూ త్వరగా కోలుకుంటున్నారు అని తెలుస్తోంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

Ram Charan Recovers : కరోనాను జయించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. త్వరలో షూటింగ్ లో పాల్గొంటానని ట్వీట్

Updated on: Jan 12, 2021 | 4:23 PM

Ram Charan Recovers: కరోనా వైరస్ సామాన్యులు, ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరినీ వణికించేస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారు అయితే ఏడాది క్రితం కంటే ఇప్పడూ త్వరగా కోలుకుంటున్నారు అని తెలుస్తోంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోవిడ్ ను జయించారు. తనకు నెగిటివ్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు చెర్రీ. తనకు నెగిటివ్ వచ్చిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని.. వీలైనంత త్వరగా షూటింగ్లో పాల్గొనాలని ఉందని తెలిపాడు. తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అందరికీ థాంక్స్ అంటూ ట్వీట్ చేశాడు చరణ్.

గత డిసెంబర్ 29 న తనకు కరోనా సోకిందని స్వయంగా రామ్ చరణ్ తెలిపాడు. ఎలాంటి లక్షణాలు లేవని.. హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నాని చెప్పాడు. మళ్ళీ 15 రోజుల అనంతరం టెస్టులు చేయించుకోగా.. నెగిటివ్ వచ్చిందని ప్రకటించాడు. అయితే చరణ్ తో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ కి కూడా అదే సమయంలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఐదు రోజుల క్రితమే తాను కోలుకున్నానని వరుణ్ తేజ్ తెలిపాడు. త్వరలో ఎఫ్ 3 షూటింగ్ లో పాల్గొననున్నానని చెప్పాడు. ఇక చరణ్ కూడా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. త్వరలో షూటింగ్ లో పాల్గొననున్నాడు.

మెగా ఫ్యామిలీ ముందుగా కరోనా బారిన పడింది మెగా బ్రదర్ నాగబాబు.. కరోనాను జయించి ప్లాస్మా దానం చేస్తానని చెప్పడమే కాదు.. కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం 4 సార్లు ప్లాస్మాదానం చేశారు. ఇక మెగా స్టార్ చిరంజీవి కూడా మొదటి కరోనా పాజిటివ్ అనే వార్తలు వచ్చాయి. కానీ టెస్టుల్లో జరిగిన పొరపాటుతో పాజిటివ్ అని వచ్చిందని.. తనకు కరోనా సోకలేదని చిరు స్వయంగా ప్రకటించారు.

Also Read: భోగి మంటలెందుకు?.. భోగి పళ్ళ వేడుకల వెనుక ఉద్దేశ్యమేంటి?.. మన సంప్రదాాయాల వెనుక అంతరార్ధం ఇదే..