Acharya Movie Shooting: ఆచార్య మూవీ యాక్షన్ సీన్ షూటింగ్ కోసం రాజమండ్రి చేరుకున్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చెర్రీ ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆచార్య చిత్ర యూనిట్ తూర్పుగోదావరి జిల్లాకు..

Acharya Movie Shooting: ఆచార్య మూవీ యాక్షన్ సీన్ షూటింగ్ కోసం రాజమండ్రి చేరుకున్న చరణ్

Updated on: Feb 16, 2021 | 11:52 AM

Acharya Movie Shooting: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చెర్రీ ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆచార్య చిత్ర యూనిట్ తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంది.

ఇప్పటికే సినిమా షూటింగ్ కోసం రామ్ చరణ్ రాజమండ్రి చేరుకున్నాడు. ఇక్కడ ఆచార్య సినిమా ఓ షెడ్యూల్ ను షూటింగ్ జరుపుకోనుంది. చరణ్ లో ఓ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి రాజమండ్రి లో చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ షెడ్యూల్ లో చిరంజీవి కూడా పాల్గొంటారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా.. జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడరు.. వేసవి వినోదంగా మే 9 రిలీజ్ కానుంది.
అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆపద్భాందవుడు సినిమా షూటింగ్ రాజమండ్రి లో జరుపుకున్న తర్వాత చిరు మూవీ ఆచార్య నే రాజమండ్రి లో చిత్రీకరించుకుంటుంది.. అయితే చరణ్ రంగస్థలం మూవీ షూటింగ్ ఎక్కువ శాతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించుకున్న సంగతి తెలిసిందే..!

Also Read:

52 యేళ్ల సినీ ప్రస్థానం.. అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ బిగ్ బీ ఎమోషనల్

బాలీవుడ్‌లో విషాదం.. మరో యువ నటుడు ఆత్మహత్య.. ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసి.. ఆపై..