RC 17 Movie: మొదలైన రామ్ చరణ్, సుకుమార్ సినిమా.. RC17 ప్రాజెక్టుకు క్లాప్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి..

రంగస్థలం వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మరోసారి రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో సినిమా రాబోతుంది. భారీ అంచనాల మధ్య రూపొదిస్తున్న కొత్త సినిమా ఆర్సీ 17. ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఈ మమూవీ ఇప్పుడు పట్టాలెక్కింది. నవంబర్ 1న ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

RC 17 Movie: మొదలైన రామ్ చరణ్, సుకుమార్ సినిమా.. RC17 ప్రాజెక్టుకు క్లాప్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి..
Rc 17 Movie

Updated on: Nov 01, 2026 | 12:13 PM

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం ఏ స్థాయిలో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇందులో సమంత కథానాయికగా నటించగా జగపతి బాబూ ప్రతి నాయకుడిగా కనిపించారు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. వీరిద్దరి కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘RC 17’. ఇటీవల ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించగా.. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. తాజాగా ఈ మూవీ నవంబర్ 1న పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచిన ‘రంగస్థలం’ తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో సినీ వర్గాల్లో , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ పూజా కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులు, ప్రముఖ నిర్మాతలు హాజరయ్యారు. అలాగే ముఖ్య అతిథిగా చిరంజీవి విచ్చేశారు. చిత్రయూనిట్ శుభ ముహుర్తాన క్లాప్ కొట్టి ప్రాజెక్టును లాంఛనంగా పట్టాలెక్కించారు. ఈ సినిమా లాంచ్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ – సుకుమార్ కలయికలో సినిమా అంటేనే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ‘రంగస్థలం’ చిత్రంలో చిట్టిబాబు పాత్రతో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ‘RC 17’ కోసం ఈ మాస్టర్ మైండ్ డైరెక్టర్ ఎలాంటి సరికొత్త కథను సిద్ధం చేశారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

ఈ భారీ బడ్జెట్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో, వాటిని పూర్తి చేసిన వెంటనే ‘RC 17’ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా ప్రారంభం కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

RC17 పూజా కార్యక్రమం..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Loading...
Unable to load recommendations.
Follow Us