గతకొద్ది రోజులుగా.. ‘మా’లో చెలరేగుతోన్న వివాదాలపై సంస్థ అధ్యక్షుడు నరేష్ స్పందించారు. ఇప్పటికిప్పుడు ఈ పదవి నుంచి దిగిపోవడానికైనా నేను రెడీ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేమీ రాజకీయ పార్టీ కాదని.. ఒక సేవా సంస్థగా భావించాలన్నారు. టాలీవుడ్‌లోని అందరి పెద్దలను కలుపుకుని వెళ్తున్నానని.. నేను పదవిలోకి వచ్చినప్పటి నుంచీ.. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాను.. నాకు ఇప్పుడు సంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు. అయితే.. నన్ను పదవి నుంచి దింపేయడం ఎవరి వల్లా కాదని.. నేను సభ్యుల ఓట్లతో గెలిచానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. రఘుపతి వెంకయ్య బయోగ్రఫీ గురించి ప్రస్తావించారు.
తెలుగు చిత్ర సీమను.. ప్రజలకు పరిచయం చేసింది అతనేని.. దానికి ఆయన ఎన్నో కష్టాలను అనుభవించాడని.. ఎన్నో ఏళ్ల నుంచి నేను ఈ సినిమా చేయాలనుకున్నా.. కానీ.. పలు షూటింగ్స్‌లో బిజీవల్ల ఈ సినిమా ఆలస్యం అయిందన్నారు. సినిమా అంటే ప్రాణామిచ్చే ప్రతీ ఒక్కరూ.. ఈ సినిమాను చూడాలని నరేష్ తెలియజేశారు. కాగా.. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.