
Prabhas Radhe Shyam: రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ 50శాతానికి పైగా పూర్తి అయ్యింది. ఇక లాక్‌డౌన్‌తో ఈ మూవీ చిత్రీకరణకు బ్రేక్ రాగా., త్వరలోనే టీమ్ విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఫ్యాన్స్ కోసం ఇటీవల ఓ ట్వీట్ పెట్టారు రాధాకృష్ణకుమార్. అందులో ఫ్యాన్స్ అడిగే ఐదు మంచి ప్రశ్నలకు ఆదివారం సమాధానం చెబుతానంటూ పేర్కొనగా.. ఆ తరువాత వాటికి సమాధానం ఇచ్చారు.
అవేంటంటే:
1. అవును డార్లింగ్‌తో పనిచేయడం నా కోరిక.సెట్స్‌లో ఆయనతో పనిచేయడం చాలా గొప్ప అనుభవం.
2.వచ్చే ఏడాది ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లలో చూస్తాము.
3.రాధేశ్యామ్‌కి డార్లింగ్ లుక్ పెద్ద అస్సెట్.
4. అవును రాధే శ్యామ్‌కి మొదటి ఛాయిస్ పూజా హెగ్డేనే.
5. మోషన్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ అన్నీ వస్తాయి. సహనంతో ఉండండి. సరైన సమయంలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాం.
ఇక రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటిస్తున్నారు. సచిన్ కేడ్కర్, భాగ్యశ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, శాషా ఛత్రీ, సత్యన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి పలు భారతీయ భాషల్లో విడుదల కానుండగా.. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
Read More:
Bigg Boss 4: గంగవ్వకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శుభాకాంక్షలు
సుశాంత్ కేసు.. ‘బాలీవుడ్’పై సీబీఐ దృష్టి