Ravi Teja Khiladi : త్వరలో రవితేజ ‘ఖిలాడీ’ షూటింగ్.. మరోసారి మాస్ రాజాతో ‘బెంగాల్ టైగర్’ భామ
మాస్ రాజా రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమాలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మునుఁడుకు రాబోతుంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్..

Ravi Teja Khiladi : మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మునుఁడుకు రాబోతుంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత రమేష్ వర్మతో సినిమా చేస్తున్నాడు రవితేజ. బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘రాక్షసుడు’ సినిమాతో ఇటీవల మంచి హిట్ అందుకున్నాడు రమేష్ వర్మ. ఇక రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ‘ఖిలాడీ’అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది.
కాగా ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా బాబ్లీ బ్యూటీ రాశిఖన్నా ను అనుకుంటున్నారట. ఇటీవలే దర్శకుడు రమేష్ వర్మ రాశితో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇక రాశిఖన్నా రవితేజ కలిసి గతంలో మూడు సినిమాల్లో నటించారు. బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు, రాజా ది గ్రేట్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది రాశి. ఇప్పడు నాలుగోసారి మాస్ రాజా సరసన ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ దక్కించుకుంది. ‘ఖిలాడీ’ సినిమాలో ఈ అమ్మడు దాదాపు కన్ఫామ్ అయినట్టే అని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు. మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టాడు దర్శకుడు రమేష్ వర్మ. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
also read : Vijay Antony New Teaser: అదరగొడుతోన్న విజయ్ ఆంటోనీ కొత్త సినిమా టీజర్.. రికార్డ్ వ్యూలతో..