రీఎంట్రీలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు సినిమాలకు ఓకే చెప్పారు పవన్. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేయగా.. రెండు మూవీల షూటింగ్‌ల్లో పవన్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కాగా ఈ మూడు మూవీలతో పాటు మరికొన్ని చిత్రాలు చేయాలని పవన్ అనుకుంటున్నారట. ఇక ఈ విషయం తెలిసిన దర్శకులు.. పవన్‌కు కథలు చెప్పేందుకు రెడీ అవుతున్నారట. ఈ క్రమంలో పవన్ కోసం పూరీ జగన్నాథ్ ఓ కథను రెడీ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ ‘ఫైటర్’ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పూరీ అనుకుంటున్నారట. ఇక ఆ లోపే పవన్ కోసం ఓ కథను రెడీ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. ఒకవేళ పూరీ చెప్పే కథ పవన్‌కు నచ్చితే.. ఈ కాంబినేషన్లో మూడో చిత్రం రావడం ఖాయం. కాగా దర్శకుడిగా పవన్ నటించిన ‘బద్రి’ సినిమాతోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు పూరీ. ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ 2012లో పవన్‌తో మరోసారి ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ మూవీని తెరకెక్కించగా.. ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. ఇక ఈ మూవీ షూటింగ్ విషయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయబేధాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు పవన్‌తో తన సంబంధం ఇప్పుడు సరిగా లేదని.. భవిష్యత్‌లో ఆయనతో సినిమాలు చేయకపోవచ్చంటూ అప్పట్లో డైరక్ట్‌గానే కామెంట్లు చేశారు పూరీ. మరి ఇప్పుడు తన మాటను వెనక్కి తీసుకొని.. ఆయనతో సినిమాను తీస్తారా..? లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read This Story Also: పవన్ కోసం బిగ్ బోట్ సెట్ వేయనున్న క్రిష్..