సుశాంత్ ఆత్మహత్య కేసు: జక్కన్న, పూరీలకు కొత్త తలనొప్పి!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును ఇప్పటికే ముంబయి పోలీసులు విచారిస్తోన్న క్రమంలోనే.. బాలీవుడ్ నటి రియాపై ఫిర్యాదు చేశారు సుశాంత్ తండ్రి.

సుశాంత్ ఆత్మహత్య కేసు: జక్కన్న, పూరీలకు కొత్త తలనొప్పి!

Edited By:

Updated on: Jul 29, 2020 | 6:09 PM

Sushnat Death Case: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును ఇప్పటికే ముంబయి పోలీసులు విచారిస్తోన్న క్రమంలోనే.. బాలీవుడ్ నటి రియాపై ఫిర్యాదు చేశారు సుశాంత్ తండ్రి. రియా చక్రవర్తి సుశాంత్‌ను మోసం చేసిందని.. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిందని, ఆర్ధికంగా, మానసికంగా సుశాంత్ కృంగిపోయేలా చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు సుశాంత్ తండ్రి కేకే సింగ్‌. ఈ క్రమంలో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

కాగా సుశాంత్ ఆత్మహత్య కేసు వలన టాలీవుడ్‌ టాప్ దర్శకులు రాజమౌళి, పూరీ జగన్నాథ్‌లకు కొత్త తలనొప్పి ప్రారంభమైనట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సుశాంత్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లిస్ట్‌లో కరణ్ జోహార్‌, అలియా భట్‌లు ఉన్న విషయం తెలిసిందే. సుశాంత్‌కి అవకాశాలు ఇవ్వకుండా కరణ్ చేశాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే సుశాంత్‌‌ గురించి ఓ ఇంటర్వ్యూలో అలియా భట్‌ మాట్లాడిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై బాగా నెగిటివిటీ పెరిగింది. ఇదిలా ఉంటే రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌లో అలియా భట్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ తెరకెక్కిస్తోన్న ఫైటర్‌కి కరణ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పుడు కరణ్, అలియాపై పెరుగుతున్న నెగిటివిటీ నేపథ్యంలో ఆ ప్రభావం తమ సినిమాలపై పడుతుందన్న ఆలోచనలో జక్కన్న, పూరీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలన్న ఆలోచనలో వీరిద్దరు ఉన్నట్లు సమాచారం.

Read This Story Also: అలా చేయడం కరెక్ట్‌ కాదు: కంగనాకు తాప్సీ కౌంటర్‌

Follow Us