Thank You Movie: ‘నా కల థ్యాంక్యూ సినిమాతో తీరింది’.. నిర్మాత దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Jul 13, 2022 | 8:56 AM

Thank You Movie: నాగ చైతన్య హీరోగా విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా థాంక్యూ. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో...

Thank You Movie: నా కల థ్యాంక్యూ సినిమాతో తీరింది.. నిర్మాత దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..
Follow us on

Thank You Movie: నాగ చైతన్య హీరోగా విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా థాంక్యూ. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాఖీఖన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మాళవిక నాయర్‌, అవికా గోర్ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే మంగళవారం ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘అక్కినేని అభిమానులకు ఈ సినిమా విందుభోజనంలా వుంటుంది. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తాడు. థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా చైతన్య పాత్రలోని ఎమోషన్స్‌తో ట్రావెల్‌ అవుతాం. జోష్‌ తరువాత చైతూకు జీవితాంతం గుర్తుండే సినిమాను ఇవ్వాలని అనుకున్నాను. అది ఈ చిత్రంతో తీరింది. ఈ చిత్రం అందరి హృదయాల్లో గుర్తుండిపోయే సినిమాగా వుంటుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఓ అద్భుతమైన సినిమా చూశామనే ఫీలింగ్‌తో థియేటర్‌ నుంచి బయటికొస్తారు’ అని చెప్పుకొచ్చాడు.

ఇక నాగచైతన్య మాట్లాడుతూ.. ‘అభిమానుల ప్రేమ , ఎనర్జీ చూస్తుంటే ఎంతటి కష్టమైనా చేయాలనిపిస్తుంది. ‘థాంక్యూ’ లాంటి సినిమా చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. ఇందులో నా పాత్రలో చాలా లేయర్స్‌ వుంటాయి. ఈ సినిమా తప్పకుండా అందరి హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకం ఉంది’ అని చై చెప్పుకొచ్చారు. రాశీఖన్నా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథతో పాటు నా పాత్ర బాగా నచ్చింది. ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం అందమైన పెయింటింగ్‌లా వుంటుంది. నా కెరీర్‌లో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..