స్టార్ హీరోలను లైన్లో పెడుతున్న కేజీఎఫ్ డైరెక్టర్.. ఈసారి మరో టాప్ హీరోతో భారీ ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ ?

|

Jan 27, 2021 | 2:07 PM

'కేజీఎఫ్' సినిమా పాన్ ఇండియా లెవల్లో విజయం సాధించిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జోరు పెంచేశాడు. దీంతో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను

స్టార్ హీరోలను లైన్లో పెడుతున్న కేజీఎఫ్ డైరెక్టర్.. ఈసారి మరో టాప్ హీరోతో భారీ ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ ?
Follow us on

‘కేజీఎఫ్’ సినిమా పాన్ ఇండియా లెవల్లో విజయం సాధించిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జోరు పెంచేశాడు. దీంతో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో యశ్‏తో కలిసి ‘కేజీఎఫ్ 2’ను నిర్మిస్తున్నాడు ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఇందులో రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‏తో ‘సలార్’ సినిమాను రూపొందించనున్నట్లుగా గతంలోనే ప్రకటించాడు. తాజాగా మరో స్టార్ హీరోతో మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడా ఈ డైరెక్టర్.

ప్రభాస్‏తో ‘సలార్’ నిర్మించిన తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‏తో ఓ సినిమా తీయబోతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ జక్కన్న నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‏ డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ వీలైనంత వరకు ఈ ఏడాదిలోనే సలార్ సినిమాను పూర్తిచేసి.. ఎన్టీఆర్ మూవీ సెట్స్ పైకి తీసుకురావాలని భావిస్తున్నట్లుగా టాక్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

Son of India : దేశభక్తి కథతో ప్రేక్షకుల ముందుకు కలెక్షన్ కింగ్.. ఫస్ట్‌‌‌లుక్ రిలీజ్ చేయనున్న చిత్రయూనిట్..