ఎట్టకేలకు దిగొచ్చిన ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యం.. కోర్టు చొరవతో ఇళయరాజాకు లభించిన అనుమతి

|

Dec 23, 2020 | 6:53 PM

చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ తనను అనుమతించక పోవడం పై సంగీత దర్శకుడు ఇళయరాజా కోర్టును ఆశ్రయించిన విషయం తెలియసిందే.

ఎట్టకేలకు దిగొచ్చిన ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యం.. కోర్టు చొరవతో ఇళయరాజాకు లభించిన అనుమతి
Follow us on

చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్ తనను అనుమతించక పోవడం పై సంగీత దర్శకుడు ఇళయరాజా కోర్టును ఆశ్రయించిన విషయం తెలియసిందే. అనుమతిలేకుండా తన సామాన్లు బయటకు విసిరేయడంపైన ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ఏడాది డిసెంబర్ లో మద్రాస్ హైకోర్టు ఈ కేసులో అటు ఇళయరాజా, ఇటు ప్రసాద్ స్టూడియోస్ మధ్యవర్తిత్వం వహించాలని సిఫారసు చేసింది. ల్యాబ్ ప్రాంగణాన్ని ఖాళీ చేయమని ఇళయరాజను కోరినప్పుడు.. అదే ప్రాంగణంలో కొనసాగడానికి అనుమతించాలని కోరుతూ స్టూడియో యజమానులపై ఇళయరాజా కేసు పెట్టారు. మద్రాస్ హైకోర్టు చొరవతో తాజాగా ప్రసాద్ స్టూడియోస్ యాజమాన్యం దిగొచ్చింది. కొన్ని ఆంక్షలతో ఇళయరాజాను తన గదికి అనుమతించేందుకు అంగీకరించారు. ల్యాబ్ పై తనకు యాజమాన్యపు హక్కులేవీ లేవు.. కానీ తన గదిలో పని చేసుకునే హక్కు తనకు ఉందనికేసు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సముచితంగా విచారించింది.ఇదిలా ఉంటే ఇళయరాజా కొత్త స్టూడియోను ఏర్పాటు చేసుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. చెన్నై కోడంబకంలో ఇళయరాజా ఒక థియేటర్ కొన్నారని, స్టూడియో నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి.