దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్. ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
తాజాగా ఈ సినిమా షూటింగ్లో ప్రకాష్ రాజ్ పాల్గోన్నాడు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ మేరకు “మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సెట్లో.. దాదాపు 25 సంవత్సరాల క్రితం ఇరువుర్ సినిమా నుంచి మాస్టర్‌తో నా ప్రయాణం కొనసాగుతుంది. ఇందులో తెలియని ఆనందం.. అలాగే కొత్త విషయాలను నెర్చుకుంటూనే ఉన్నాను” అంటూ ట్వీట్ చేశాడు ప్రకాష్ రాజ్. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
On the sets of #Maniratnam s #PonniyinSelvan .. a journey with the master ..which started 25 years back from #iruvar continues… the joy of unlearning… finding new horizons… bliss n blessed
— Prakash Raj (@prakashraaj) January 14, 2021
Also Read: ‘మాస్టర్’ టీజర్ విడుదల, అదిరగొట్టిన విజయ్, పోరుకు రెడీ అంటోన్న సేతుపతి
ఓటీటీ అనేది ఒక ఇండస్ట్రీ, దాన్ని తెలుగులోకి మేము తీసుకురావడం గర్వంగా ఉంది : అల్లు అర్జున్