Prakash Raj help Student: ప్రకాష్ రాజ్ మంచి నటుడే కాదు అంతకు మించిన మనసున్న వ్యక్తి. ఎవరైనా ఆపద అని ఆయనను కోరితే.. కచ్చితంగా సాయం చేస్తారు. ఇప్పటికే తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు ఓ వ్యక్తికి ఇంటిని కట్టించడం, లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు సాయం చేయడం ఇలాంటివి ఆయన చాలానే చేశారు. ఇక తాజాగా మరోమారు ప్రకాష్ రాజ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెద్దేవం గ్రామానికి చెందిన సిరిచందన అనే విద్యార్థినికి ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు సీటు దక్కింది. అయితే తండ్రి లేకపోవడం, ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండటంతో ఆ ఆశను వదులుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబానికి దగ్గరైన నరేంద్ర అనే వ్యక్తి ప్రకాష్ రాజ్‌ని కాంటాక్ట్ అయి విషయం చెప్పగా.. ఆ అమ్మాయిని చదివేందుకు ఆయన ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌కి వచ్చిన సిరిచందన కుటుంబ సభ్యులు ప్రకాష్ రాజ్‌ని కలుసుకొని కృతఙ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా బాగా చదువుకోవాలని ప్రకాష్ రాజ్ ఆమెకు సూచించారు.
ఇక ఈ సాయంపై సిరిచందన మాట్లాడుతూ.. మమ్మల్ని ఆదుకునేందుకు ప్రకాష్ రాజ్ ముందుకు రావడం మమ్మల్ని ఆనందానికి గురిచేసింది. ఆయన ఆదర్శంతో బాగా చదువుకొని భవిష్యత్‌లో మరో నలుగురికి సాయం చేయాలనుకుంటున్నా. ఆయనకు రుణపడి ఉంటా అని అన్నారు.
Read More:
సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం.. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్
Bigg Boss 4: ‘జండర్ ఈక్వాలిటీ’ టాస్క్.. కంటెస్టెంట్‌లు అదరగొట్టేశారుగా