Prabhu Deva marriage: ఇండియన్ మైఖేల్ జాక్సన్, మల్టీటాలెంటెడ్ ప్రభుదేవా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మేన కోడలు వరుస అయ్యే అమ్మాయితో రిలేషన్‌లో ఉంటోన్న ప్రభుదేవా, ఆమెను త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. (కరోనా అప్‌డేట్స్: దేశవ్యాప్తంగా 87లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య.. కోలుకున్న 81లక్షల మంది
కాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ రెండో తనయుడైన ప్రభుదేవా డ్యాన్సర్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తరువాత నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా అంచెలంచెలు ఎదిగారు. 1995లో ప్రభుదేవా, రమాలత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత నయనతారతో ప్రేమలో పడ్డ ప్రభుదేవా ఆమెను వివాహం చేసుకోవడం కోసం రమాలత్‌కి విడాకులు కూడా ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వలన వీరిద్దరి పెళ్లి ఆగిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆయన సింగిల్‌గా ఉంటూ వస్తున్నారు. ఆ మధ్యన పలువురు హీరోయిన్లతో ప్రభుదేవా డేటింగ్ వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ రూమర్లుగా తేలాయి. ఇక తాజా సమాచారం ప్రకారం శోభను ప్రభుదేవా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. (మరోసారి దాతృత్వం చాటుకున్న షారూక్.. ధన్యావాదాలు చెప్పిన కేరళ ఆరోగ్య మంత్రి)
ఇక సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా రాధే మూవీని తెరకెక్కిస్తున్నారు. అలాగే తేల్, యంగ్ మంగ్ సంగ్, ఓమై విళిగల్, బఘీర అనే చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. (‘పుష్ప’ కోసం విజయశాంతిని సంప్రదించారా.. రాములమ్మ వద్దనడానికి కారణం ఇదేనా..!)