యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ నెల 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కొన్ని పోస్టర్లను, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ వచ్చిన సాహో యూనిట్.. తాజాగా ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది.
ఈ నెల 10న సాహో ట్రైలర్ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని ప్రభాస్ ఫేస్‌బుక్‌లో చెబుతూ.. ‘‘డార్లింగ్స్, సాహో ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సమయం. సాహో ట్రైలర్ ఈ నెల 10న రానుంది. సిద్దంగా ఉండండి’’ అని పేర్కొన్నాడు.
ఇదిలా భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి వంటి భారీ హిట్ తరువాత ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.