AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: మారుతి మూవీ సెట్స్‌ నుంచి లీకైన రెబల్‌ స్టార్‌ ఫొటో.. మునుపెన్నడూ కనిపించని లుక్‌లో ప్రభాస్‌.

వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌. బాహుబలితో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ తర్వాతి చిత్రాలపై భారీగా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్‌ కూడా ప్రభాస్‌..

Prabhas: మారుతి మూవీ సెట్స్‌ నుంచి లీకైన రెబల్‌ స్టార్‌ ఫొటో.. మునుపెన్నడూ కనిపించని లుక్‌లో ప్రభాస్‌.
Prabhas New Look
Narender Vaitla
|

Updated on: Dec 25, 2022 | 3:21 PM

Share

వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్‌. బాహుబలితో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ తర్వాతి చిత్రాలపై భారీగా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్‌ కూడా ప్రభాస్‌ ప్రతీ చిత్రాన్ని అత్యంత భారీగా తెరకెక్కి్స్తున్నారు. సాలార్‌, ప్రాజెక్ట్‌, ఆదిపురుష్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్‌ ప్రకటించిన ప్రతీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందే. ఇక భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటిస్తూనే మారుతితో ఓ చిత్రంతో నటిస్తున్నారు డార్లింగ్‌. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాను మారుతి హార్రర్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. రామోజీ ఫిలిమ్‌ సిటీలో భారీ సెట్టింగ్ వేసినట్లు సమాచారం. తాజాగా ఈ సెట్‌కు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమా సెట్స్‌ నుంచి ఈ ఫొటో లీక్‌ అయినట్లు అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

షూటింగ్‌ గ్యాప్‌లో మారుతి, ప్రభాస్‌ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇందులో ప్రభాస్‌ పూర్తిగా డిఫ్రంట్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. వింటేజ్‌ స్టైల్‌లో ఉన్న ప్రభాస్‌ లుక్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఈ సినిమా రాజా డీలక్స్‌ అనే థియేటర్‌ చుట్టూ తిరుగుతుందని, తాతా, మనవళ్ల మధ్య సాగే కథనంతో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా మాళవిక మోహన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధీ కుమార్‌ నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
తండ్రికి ప్రాణదానం చేసిన ఇద్దరు కూతుళ్లు..!
తండ్రికి ప్రాణదానం చేసిన ఇద్దరు కూతుళ్లు..!
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫ్రూట్స్
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫ్రూట్స్
30 రోజుల్లో ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. వాహనదారులకు అలర్ట్..
30 రోజుల్లో ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. వాహనదారులకు అలర్ట్..
శని వక్రగతి.. ఈ 4 రాశుల అదృష్టం మారబోతోందా? ధనలాభాలు, ప్రమోషన్స్
శని వక్రగతి.. ఈ 4 రాశుల అదృష్టం మారబోతోందా? ధనలాభాలు, ప్రమోషన్స్
చిన్న గింజల్లో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. చిటికెడు తిన్నా చాలు
చిన్న గింజల్లో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. చిటికెడు తిన్నా చాలు
జీ-7లో మోదీని చూసి మెలోని ఫన్నీ కామెంట్..!
జీ-7లో మోదీని చూసి మెలోని ఫన్నీ కామెంట్..!
కూరగాయలు కోసే ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే పాతకాలం రెసిపీ
కూరగాయలు కోసే ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే పాతకాలం రెసిపీ