Tollywood: ఫ్యాన్స్ కోసం జపాన్ వెళ్లనున్న స్టార్.. మాట నిలబెట్టుకుంటున్న హీరో

జపాన్‌లో ఒక్కసారిగా సందడి మొదలైంది! ‘అతను వస్తున్నాడు… మనకోసం ప్రత్యేకంగా వస్తున్నాడు!’ అంటూ జపాన్ ఫ్యాన్స్ ఎక్సైట్‌మెంట్ పీక్‌కి చేరింది. గత ఏడాది తన సినిమా రిలీజ్ సమయంలో అభిమానులకు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు. పలు కారణాలతో ఆలస్యమైన జపాన్ టూర్… ఇప్పుడు పట్టాలెక్కింది. ఫ్యాన్ మీట్ ..

Tollywood: ఫ్యాన్స్ కోసం జపాన్ వెళ్లనున్న స్టార్.. మాట నిలబెట్టుకుంటున్న హీరో
Tollywood Star

Updated on: Nov 20, 2025 | 1:43 PM

జపాన్‌లో ఒక్కసారిగా సందడి మొదలైంది! ‘అతను వస్తున్నాడు… మనకోసం ప్రత్యేకంగా వస్తున్నాడు!’ అంటూ జపాన్ ఫ్యాన్స్ ఎక్సైట్‌మెంట్ పీక్‌కి చేరింది. గత ఏడాది తన సినిమా రిలీజ్ సమయంలో అభిమానులకు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు. పలు కారణాలతో ఆలస్యమైన జపాన్ టూర్… ఇప్పుడు పట్టాలెక్కింది. ఫ్యాన్ మీట్, ఫోటో సెషన్స్, ఇంటరాక్షన్ పూర్తి ఫెస్టివల్ మూడ్‌లో జరగనుంది. బాహుబలి నుంచి కల్కి వరకు జపాన్‌లో రికార్డులు బద్దలు కొట్టిన ఆ స్టార్ హీరో… ఇంతకీ ఎవరో తెలుసా? అవును, మన డార్లింగ్ ప్రభాస్! తన జపాన్ ఫ్యాన్స్‌కు ఇచ్చిన ప్రామిస్‌ను నెరవేర్చేందుకు త్వరలో టోక్యో ల్యాండ్ అవుతున్నాడు. జపాన్ ఫ్యాన్స్ ఇప్పటికే కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు

డార్లింగ్​ ప్రభాస్​..

భారతీయ సినిమా పరిశ్రమలో పాన్ఇండియా సూపర్‌స్టార్‌గా మారిన హీరో ప్రభాస్. మనదేశంలోనే కాదు ప్రభాక్​కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. డార్లింగ్​ ప్రభాస్​ సినిమాలు దక్షిణాది నుంచి హిందీ వరకు, అంతేకాకుండా జపాన్, చైనా వంటి ఆసియా దేశాల్లో కూడా భారీ విజయాలు సాధించాయి. ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 ఏడి’ సినిమా జపాన్‌లో రికార్డులు సృష్టించింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారతదేశంలో మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా టాప్ చార్ట్‌లలో నిలిచింది. జపాన్‌లో ‘కల్కి’కి భారీ వెల్కమ్ లభించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా మారారు. ఈ నేపథ్యంలో, ప్రభాస్ తన జపాన్ ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి సిద్ధమవుతున్నాడు. ఇది అతని ఫ్యాన్స్‌తో ముడిపడిన బంధాన్ని మరింత బలపరుస్తుంది.

ప్రభాస్ ‘బాహుబలి’ సిరీస్‌తో జపాన్‌లో బాగా పాపులర్​ అయ్యాడు. 2017లో విడుదలైన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ జపాన్‌లో భారీ కలెక్షన్స్ సాధించి, భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా జపాన్ బాక్సాఫీస్ వద్ద 10 మిలియన్ డాలర్లు (సుమారు 80 కోట్ల రూపాయలు) సంపాదించింది. బాహుబలి ట్రైలర్ జపాన్‌లో వైరల్ అవ్వడంతో ప్రభాస్‌కు ‘ది రెబెల్ జనరల్’ అనే పేరు వచ్చింది.

ఆ తర్వాత ‘సాహో’, ‘ఆదిపురుష్’ వంటి సినిమాలు కూడా జపాన్ మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ పొందాయి. ‘కల్కి 2898 ఏడి’తో ప్రభాస్ మళ్లీ జపాన్‌లో రికార్డులు మోగించాడు. ఈ సినిమా జపాన్‌లో ఆగస్టు 2024లో విడుదలై, భారీ టర్నౌట్‌తో హిట్ అయింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సినిమా జపాన్‌లో భారీ ప్రశంసలు అందుకుంది. కల్కి సినిమా జపాన్‌లో 5 మిలియన్ డాలర్లు (సుమారు 40 కోట్ల రూపాయలు) కలెక్ట్ చేసింది.

Prabhass

ఇచ్చిన మాటకోసం..

ఈ సినిమా విడుదల సమయంలో ప్రభాస్ జపాన్ పర్యటకు వస్తానని మాటిచ్చాడు. కానీ, కాలు గాయపడటంతో ఆ ప్లాన్ ఆలస్యం అయింది. గాయం వల్ల షూటింగ్‌లు కూడా ఆలస్యమయ్యాయి. ఇప్పుడు, పూర్తిగా రికవర్ అయిన ప్రభాస్ తన మాట ఇచ్చినట్టు జపాన్‌కు వెళ్తున్నాడని వార్తలు తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. ‘నా జపాన్ ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాట మరవలేను. త్వరలో మిమ్మల్ని కలుస్తాను!’అని చెప్పాడని అంటున్నాయి సినీ వర్గాలు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ప్రభాస్​ రాజాసాబ్​, ఫౌజీ, స్పిరిట్​ సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రాజాసాబ్​ ప్రమోషన్స్​ ప్రారంభించేందుకు మూవీ టీమ్​ ప్లాన్​ చేస్తోంది. జపాన్ వంటి మార్కెట్‌లలో భారతీయ సినిమా విస్తరించడంలో ప్రభాస్ పాత్ర కీలకం. ఈ ఫ్యాన్ మీట్ జపాన్‌లో భారతీయ సినిమా ప్రచారానికి కూడా దోహదపడుతుంది. త్వరలో జపాన్‌లో ప్రభాస్ ఫ్యాన్ ఫెస్ట్ – ఇది టాలీవుడ్‌కు మరో మైలురాయి!

Follow Us