Ram Charan-Prabhas: ఇది కదా అభిమానమంటే! రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు బుధవారం (మార్చి 27) ఘనంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు,అభిమానులు, నెటిజన్లు చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక మెగా అభిమానులు గ్లోబల్ స్టార్ బర్త్ డేను పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. పలు చోట్ల అన్నదానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశారు

Ram Charan-Prabhas: ఇది కదా అభిమానమంటే! రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
Ram Charan, Prabhas
Follow us

|

Updated on: Mar 28, 2024 | 5:25 PM

టాలీవుడ్ మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు బుధవారం (మార్చి 27) ఘనంగా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు,అభిమానులు, నెటిజన్లు చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక మెగా అభిమానులు గ్లోబల్ స్టార్ బర్త్ డేను పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. పలు చోట్ల అన్నదానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశారు . ఇతర సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహించారు. ఇక ప్రభాస్ అభిమానులు కూడా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేశారు. సోషల్ మీడియాలో చెర్రీకి పుట్టిన రోజు విషెస్ తెలపడమే కాకుండా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అనాథలు, పేద పిల్లలకు ఫుడ్ ఫ్యాకెట్స్ పంపిణీ చేశారు. ‘డార్లింగ్ ఫ్యాన్స్ తరఫున ప్రియమైన రామ్ చరణ్ కోసం’ అంటూ పలు చోట్ల ఫుడ్ ప్యాకెట్స్ పంచారు. ఫుడ్ బాక్సులపై రామ్ చరణ్, ప్రభాస్ కలిసున్న ఫొటోలతో పాటు ‘హ్యాపీ బర్త్ డే మెగా పవర్ స్టార్’ అని కూడా ముద్రించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన రామ్‌ చరణ్ అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఇక సామాన్య జనాలు కూడా వీటిని చూసి ‘ఇది కదా అసలైన అభిమానమంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

డల్లాస్ లోనూ చెర్రీ పుట్టిన రోజు వేడుకలు..

అమెరికాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. డల్లాస్ లోని స్పైస్ రాక్ రెస్టారెంట్‌లో చెర్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు అభిమానులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. చెర్రీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

పిల్లలకు ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.