Pawan Kalyan: మూడు పెళ్లిళ్లపై తొలిసారి స్పందించిన పవన్‌ కళ్యాణ్‌.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో ఏం చెప్పనున్నారు.?

నట సింహం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి నిర్వహిస్తున్న టాక్‌ షో. అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా టెలికాస్ట్‌ అవుతోన్న ఈ ప్రోగ్రామ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మొదటి సీజన్‌ను విజయవంతగా పూర్తి చేసుకున్న..

Pawan Kalyan: మూడు పెళ్లిళ్లపై తొలిసారి స్పందించిన పవన్‌ కళ్యాణ్‌.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో ఏం చెప్పనున్నారు.?
Pawan In Aha Unstoppable

Updated on: Jan 30, 2023 | 7:50 PM

నట సింహం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి నిర్వహిస్తున్న టాక్‌ షో. అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా టెలికాస్ట్‌ అవుతోన్న ఈ ప్రోగ్రామ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మొదటి సీజన్‌ను విజయవంతగా పూర్తి చేసుకున్న ఈ షో రెండో ఎపిసోడ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక రెండో ఎపిసోడ్‌కు కూడా మేకర్స్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఈ సెకండ్‌ సీజన్‌ లాస్ట్‌ ఎపిసోడ్‌పై పడింది. చివరి ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా పవన్‌ కళ్యాణ్‌ హాజరవుతుండడమే దీనికి కారణం.

పవన్‌ అన్‌స్టాపబుల్‌కు హాజరుకానున్నారన్న వార్త బయటకు రాగానే ఫ్యాన్స్‌లో జోష్‌ని పెంచేసింది. పవన్‌ హాజరుకానున్న ఈ షోను మేకర్స్‌ రెండు పార్ట్స్‌గా స్ట్రీమింగ్ చేయనున్నారు. మొదటి ఎపిసోడ్‌ ఫిబ్రవరి 3వ తేదీన స్ట్రీమింగ్‌ కానుండగా, రెండో ఎపిసోడ్‌ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో షోపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలయ్య ప్రశ్నలకు పవన్‌ ఎలాంటి సమాధానాలు ఇస్తారనే ప్రశ్న మొదలైంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా పవన్‌ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా వదిన సురేఖ, అల్లు అరవింద్‌ తల్లి కనర రత్నం ప్రోత్సాహంతో పాటు సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న ఆటుపోట్లకు సంబంధించి పవన్‌ వ్యాఖ్యానించారు. ఇక విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లో బస్సు పైన డ్యాన్స్ చేయాల్సి వచ్చిందన్న విషయాలను పంచుకున్నారు. ఇదిలా ఉంటే పవన్‌ తొలిసారి తన మూడు పెళ్లిలపై కూడా ఈ షోలో స్పందించారు. దీంతో ఇంతకీ పవన్‌ ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి పవన్‌ చెప్పిన ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 3వ తేదీన స్ట్రీమింగ్‌ అయ్యే ఎపిసోడ్‌ను చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us