భారత్‏లో రేపటి నుంచి ఆ పాపులర్ ఛానళ్స్ కనిపించవా ?.. సీనిప్రియుల పరిస్థితి ఏంటీ ?..

|

Dec 14, 2020 | 7:22 PM

ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ హెచ్‏బీఓ, డబ్యూబీ ఇక నుంచి భారత్‏లో పనిచేయవంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజాంగానే ఆ ఛానళ్ళు ఇండియాలో పనిచేయవా?

భారత్‏లో రేపటి నుంచి ఆ పాపులర్ ఛానళ్స్ కనిపించవా ?.. సీనిప్రియుల పరిస్థితి ఏంటీ ?..
Follow us on

సినిప్రియులకు బ్యాడ్ న్యూస్. ప్రముఖ ఇంగ్లీష్ మూవీ ఛానల్స్ హెచ్‏బీఓ, డబ్యూబీ ఇక నుంచి భారత్‏లో పనిచేయవంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  దీంతో నిజాంగానే ఆ ఛానళ్ళు ఇండియాలో పనిచేయవా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంది.

కాగా డిసెంబర్ 15 నుంచి ఇండియాతో సహా పాకిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్‏లలో హెచ్‏బీఓ, డబ్యూబీ ఛానళ్ళను నిలిపివేయనున్నట్లుగా వార్నర్ మీడియా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అటు దక్షిణాసియాలో పిల్లలు ఎక్కువగా చూసే కార్టూన్ నెట్‏వర్క్, పోగో ఛానళ్ళను మాత్రం కొనసాగిస్తామని, అంతేకాకుండా ఇంటర్నేషనల్ సీఎన్ఎన్ ఛానళ్‏ను కూడా ప్రసారం చేస్తామని వార్నర్ మీడియా స్పష్టం చేసినట్లుగా సమాచారం. లాక్‏డౌన్ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్‏ఫామ్‏లు డిస్నీ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లాంటివి అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఈ ఛానళ్ళను చూడడం లేదు. దీంతో ఈ కంపెనీ మిగతా ఓటీటీ యాప్‏లకు దీటుగా హెచ్‏బీఓ మాక్స్ అనే కొత్త స్ట్రీమింగ్ ఫ్లాట్‏ఫామ్‏ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా రేపటి నుంచి నిజంగానే ఈ ఛానళ్ళు ప్రసారం అవుతాయా.. లేదా అనేది చూడాలి.