పెళ్లై 11 రోజులు.. భర్తను అరెస్ట్ చేయించిన పూనమ్‌

బాలీవుడ్ బ్యూటీ పూనమ్‌ పాండే ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా ప్రేమించిన సామ్ బాంబేను ఆమె పెళ్లి చేసుకున్నారు.

పెళ్లై 11 రోజులు.. భర్తను అరెస్ట్ చేయించిన పూనమ్‌

Edited By:

Updated on: Sep 23, 2020 | 1:18 PM

Poonam Pandey news: బాలీవుడ్ బ్యూటీ పూనమ్‌ పాండే ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా ప్రేమించిన సామ్ బాంబేను ఆమె పెళ్లి చేసుకున్నారు. పెళ్లిలోనూ ఈ జంట తమ ప్రేమను చూపించారు. మనచుట్టూ ఎవరూ లేరు అన్నంత సాన్నిహిత్యంగా ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీరి పెళ్లి జరిగి 11 రోజులు పూర్తి కాగా.. ఈ లోపే తన భర్తపై పోలీసులకు కంప్లైట్ ఇచ్చారు పూనమ్‌.

ఇటీవల సినిమా షూటింగ్ కోసం పూనమ్‌ గోవా వెళ్లగా.. తన భర్త తనను వేధిస్తున్నాడంటూ కెనాకోనా గ్రామ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. సామ్‌ తనపై దాడి చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు సామ్‌ని మంగళవారం అరెస్ట్ చేశారు. ఆ తరువాత వైద్య పరీక్షల నిమిత్తం పూనమ్‌ని ఆసుపత్రికి పంపారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న పూనమ్‌.. కేవలం పదిహేను రోజులకే భర్తపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మరి సామ్‌ తన వెర్షన్‌ ఏం చెప్తాడో చూడాలి.

Read More:

షారూక్‌-అట్లీ మూవీ.. ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌..!

ఈ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారా.. కేంద్రం హెచ్చరికలు