Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు కమిట్ అయ్యి చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసిన పవన్. క్రిష్ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఈ సినిమాతో పాటు ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ కూడా చేస్తున్నారు. ఆ తర్వాత వరుసగా హరీష్ శంకర్ తో, సురేందర్ రెడ్డితో సినిమాలు చేయబోతున్నారు. అలాగే బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు పవన్.
ఇక క్రిష్ పవన్ సినిమా పిరియాడికల్ స్టోరీతో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా మొగలుల కాలంనాటి స్టోరీతో తెరకెక్కనుంది. కోహినూరు వజ్రం నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ త్వరలో కొన్ని ప్రొడక్షన్ హౌస్ లలో పెట్టుబడులు పెట్టనున్నారని ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ అందుకోనున్నారట. అయితే తనకు వచ్చే పారితోషకంలో దాదాపు 40 శాతాన్ని వివిధ ప్రొడక్షన్ హౌసెస్ లో పెట్టుబడిగా పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.
also read : Rashmika Mandanna : స్నేహితులతో సరదాగా సాగరతీరంలో లక్కీ బ్యూటీ రష్మిక .. వీడియో వైరల్