ఇస్రోకు ‘బాహుబలి’ పేరు పెట్టడంపై డార్లింగ్ స్పందన

| Edited By: Pardhasaradhi Peri

Jul 22, 2019 | 7:08 PM

చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంపై స్పందించారు రెబల్ స్టార్ ప్రభాస్. ‘హల్లో డార్లింగ్స్.. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల యావత్ భారతీయులు గర్వపడుతున్నారని’ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇస్రో శాస్ర్తవేత్తలను ప్రభాస్ విష్ చేశారు. చంద్రయాన్-2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహకానికి బాహుబలి అని పేరు పెట్టడం గౌరవంగా భావిస్తున్నాను.. అందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 300 వందల టన్నుల బరువైన చంద్రయాన్-2ను ప్రయోగించడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఇస్రో యూనిట్.. […]

ఇస్రోకు బాహుబలి పేరు పెట్టడంపై డార్లింగ్ స్పందన
Follow us on

చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంపై స్పందించారు రెబల్ స్టార్ ప్రభాస్. ‘హల్లో డార్లింగ్స్.. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల యావత్ భారతీయులు గర్వపడుతున్నారని’ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఇస్రో శాస్ర్తవేత్తలను ప్రభాస్ విష్ చేశారు. చంద్రయాన్-2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహకానికి బాహుబలి అని పేరు పెట్టడం గౌరవంగా భావిస్తున్నాను.. అందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 300 వందల టన్నుల బరువైన చంద్రయాన్-2ను ప్రయోగించడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఇస్రో యూనిట్.. బాహుబలి చిత్ర యూనిట్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ధన్యవాదాలు తెలిపారు. ఏదైమైనా మొత్తానికి చంద్రయాన్-2తో భారతీయ ఖ్యాతి మరింత పెరిగిందనే చెప్పాలి.

కాగా.. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైన క్షణాలను ప్రతి భారతీయుడు సగర్వంగా గుర్తుంచుకుంటారని జనసేన అధినేత, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రయాన్-2 రాకెట్ నిర్ధేశిత లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా మన దేశాన్ని అగ్రదేశాల జాబితాలో నిలిపిందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు నా తరపున, జనసైనికుల తరపున అభినందనలు తెలిపారు పవన్.