Bheemla Nayak: పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రేపే భీమ్లా నాయక్‌ ప్రీ రిలిజ్‌ ఈవెంట్‌..

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) అభిమానులకు భీమ్లా నాయక్‌ చిత్ర యూనిట్‌ శుభవార్త తెలిపింది. భీమ్లా నాయక్‌ ప్రీ రిలిజ్‌ ఈవెంట్‌ జరుగుతుందా.? లేదా అన్న సంశయంలో ఉన్న ఫ్యాన్స్‌కు ఈవెంట్‌పై క్లారిటీ ఇచ్చేసింది. అందరూ ఊహించినట్లుగానే బుధవారం ప్రీ రిలిజ్‌...

Bheemla Nayak: పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. రేపే భీమ్లా నాయక్‌ ప్రీ రిలిజ్‌ ఈవెంట్‌..
Bheemla Nayak

Updated on: Feb 22, 2022 | 12:35 PM

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) అభిమానులకు భీమ్లా నాయక్‌ చిత్ర యూనిట్‌ శుభవార్త తెలిపింది. భీమ్లా నాయక్‌ ప్రీ రిలిజ్‌ ఈవెంట్‌ జరుగుతుందా.? లేదా అన్న సంశయంలో ఉన్న ఫ్యాన్స్‌కు ఈవెంట్‌పై క్లారిటీ ఇచ్చేసింది. అందరూ ఊహించినట్లుగానే బుధవారం ప్రీ రిలిజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. హైదారాబాద్‌ యూసుఫ్‌గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌లో బుధవారం సాయంత్రం 6:30 గంటల నుంచి ఈ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ వేడుకకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అథితిగా హాజరుకానున్న విషయం తెలిసిందే. వకీల్‌ సాబ్‌ తర్వాత పవన్‌ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే నిజానికి భీమ్లా నాయక్‌ ప్రీ రిలిజ్‌ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గౌతమ్‌ రెడ్డి అకాల మరణంతో ఈవెంట్‌ను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 25న సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో, ఈవెంట్‌ను నిర్వహించరన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటికీ చెక్‌ పెడుతూ చిత్ర యూనిట్‌ కాసేపటి క్రితమే ప్రీరిలిజ్‌ ఈవెంట్‌ విషయమై అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఇదిలా ఉంటే భీమ్లా నాయక్‌ సినిమాను మలయాళంలో భారీ సక్సెస్‌ అందుకున్న అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో పవన్‌ కళ్యాణ్‌తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. పవన్‌కు జోడిగా నిత్యా మీనన్‌ కనిపిస్తుండగా, రానా సరసన సంయుక్త మీనన్‌ నటిస్తోంది. భారీ అంచనాల నడు విడుదలవుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read: కలెక్టర్‌కు ఫోన్ చేసి షాకిచ్చిన మద్యం ప్రియుడు.. అతని కోరిక వింటే అవాక్కవ్వాల్సిందే..