Pawan Kalyan Vakeel Saab: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం వకీల్ సాబ్. హిందీలో ఘన విజయం సాధించిన పింక్ రీమేక్‌గా వకీల్ సాబ్ తెరకెక్కుతోంది. కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ రాగా.. ఇటీవల మళ్లీ ప్రారంభించారు. అయితే ఈ షూటింగ్‌లో పవన్ ఇంకా జాయిన్ అవ్వలేదు. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 26 నుంచి పవన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం పవన్ 20 రోజులను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ లోపు ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేయాలని దర్శకనిర్మాతలకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన డేట్లకు అనుగుణంగా ఇప్పుడు దర్శకుడు వేణు శ్రీరామ్ షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
ఇక ఈ మూవీలో పవన్ సరసన శ్రుతీ హాసన్ నటిస్తున్నారు. అంజలి, నివేథా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read More:
అవేవీ పట్టించుకోని రాజమౌళి.. పెద్ద సాహసమే చేస్తున్నాడా..!
క్రేజీ మల్టీస్టారర్‌లో జగపతిబాబు..!