తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తో ‘బిల్లా’,’ఆరంభం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీశాడు డైరెక్టర్ విష్ణువర్ధన్. అంతేకాదు ఈయన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘పంజా’ అనే సినిమా కూడా తీశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నా విష్ణువర్ధన్ టేకింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ డైరెక్టర్ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ఈయన త్వరలోనే ఒక వెబ్ సిరీస్ ను నిర్మించనున్నారట. సరికొత్త కథాంశంతో రూపొందే ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ తమిళ నటీనటులను ఎంపిక చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇక డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సిరీస్ ను కేవలం నిర్మిస్తారట. ఒక నూతన దర్శకుడు ఈ వెబ్ సిరీస్ రూపొందించనున్నారు.
మరోవైపు ప్రస్తుతం డైరెక్టర్ విష్ణువర్ధన్ ‘విక్రమ్ బాత్రా’ అనే సినిమా తెరకెక్కించనున్నాడు. ఇందులో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్ర పోషిస్తుండగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.