
ఓటీటీలో సినిమాలకు కొదవే ఉండదు. రకరకాల జోనర్స్ లో వదల కొద్దీ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీలో వెంటనే స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. దాంతో థియేటర్స్ లో మిస్ అయినా వారు ఓటీటీలో సినిమాలు చూస్తుంటారు. అలాగే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కాగా ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాల్లో థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ జోనర్స్ ఎక్కువ. ఇలాంటి సినిమాలు చూడటానికి ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కాగా ఓటీటీలో రొమాంటిక్ సినిమాల హావ నడుస్తుంది. ఒంటరిగా కూర్చొని ఈ సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. రొమాంటిక్ కంటెంట్ తో తెరకెక్కే సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.
ఈ సినిమా హాలీవుడ్ లో తెరకెక్కింది. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. మన కల్చర్ కు విదేశాల కల్చర్ కు చాలా తేడా ఉన్నటుంది. మన దగ్గర ఓ అమ్మాయి అబ్బాయి కలిసి ,మాట్లాడుకుంటే అదేదో పెద్ద నేరమో ఘోరమో అని భావిస్తారు. కానీ ఇతర దేశాల్లో అలా కాదు. పిల్లలకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వారిని ఫ్రీగా వదిలేస్తారు. వారి జీవితం వారి ఇష్టమొచ్చినట్టు బ్రతికేలా చూస్తారు. ఈ సినిమాలో ఒక కుర్రాడు ఉంటాడు. అతను చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు. ఎవరితో మాట్లాడాడు, ఇంట్లో నుంచి బయటకు రాడు, ఏ అమ్మాయితో మాట్లాడాడు.
దాంతో ఆ కుర్రాడి పేరెంట్స్ అతడిని ఎలాగైనా ,మార్చాలి అని అనుకుంటారు. తమ కొడుకుతో డేటింగ్ చేస్తే కారును వాడుకునే ఆఫర్ ఇస్తారు. దాంతో ఓ అమ్మాయి కారు కోసం అతనితో డేటింగ్ చేయడానికి రెడీ అవుతుంది. ఆ అమ్మాయి నచ్చిన వారితో రొమాన్స్ చేస్తుంటుంది. అలాంటి అమ్మాయి ఆ కుర్రాడితో ఏం చేసింది అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అలాగే కొన్ని సీన్స్ ఘూటుగాను ఉంటాయి. ఫ్యామిలీతో ఈ సినిమా చూడలేం కాబట్టి ఒంటరిగానే చూడాలి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరు నో హార్డ్ ఫీలింగ్స్. ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.