AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. సూర్య 250 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఈ మూవీ సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. సూర్య 250 కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే
Vishwanath And Sons
Basha Shek
|

Updated on: Sep 08, 2026 | 5:47 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవీనా టాండన్ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. ఓవరాల్ గా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హీరో సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూర్య నటన, మమితా బైజు అల్లరి, రాధిక, రవీనా టాండన్ ల అభినయం, డైరెక్టర్ వెంకీ అట్లూరి టేకింగ్, అలాగే జీవీ ప్రకాశ్ కుమార్ పాటలు, ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా ఈ సినిమాలో హైలైట్ అయిన అంశాలు చాలానే ఉన్నాయి. తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 11) నుంచే సూర్య ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘మీట్ సంజయ్ విశ్వనాథ్.. అథ్లెట్, బిలియనీర్, ఫిలాంత్రోపిస్ట్ అండ్ లవింగ్ ఫాదర్’ అంటూ విశ్వనాథ్ అండ్ సన్స్ స్ట్రీమింగ్ డేట్ ను రివీల్ చేసింది. తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ సూర్య సినిమా స్ట్రీమింగ్ కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను నిర్మించారు. నాజర్, సునీల్ రెడ్డి, రాజీవ్ మేనన్, హర్ష చెముడు, కాళి వెంకట్, దీపా శంకర్, హైపర్ ఆది, మైమ్ గోపి, సర్వదమన్ బెనర్జీ తదితరులు వివిధ పాత్రల్లో కనిపించారు. మరి థియేటర్లలో ‘విశ్వనాథం అండ్ సన్స్’ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే మూడు రోజులు ఆగండి.. ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్..

 విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పుల్లపుల్లగా, కారంగా నోటికి భలే రుచిగా ఉండే చల్ల పిండి
పుల్లపుల్లగా, కారంగా నోటికి భలే రుచిగా ఉండే చల్ల పిండి
50టీస్‌లోనూ 20టీస్‌లా ఫిట్‌గా కనిపించాలా?.. జస్ట్ ఇలా చేస్తే చాలు
50టీస్‌లోనూ 20టీస్‌లా ఫిట్‌గా కనిపించాలా?.. జస్ట్ ఇలా చేస్తే చాలు
రాత్రిపూట పురుషులు గూగుల్‌లో ఎక్కువగా దేని కోసం వెతుకుతారో తెలుసా
రాత్రిపూట పురుషులు గూగుల్‌లో ఎక్కువగా దేని కోసం వెతుకుతారో తెలుసా
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో వినిపిస్తున్న అనిల్ పండిట్ పేరు
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో వినిపిస్తున్న అనిల్ పండిట్ పేరు
సాలీడుకి నిప్పు పెట్టబోయి.. రూ.కోటి విల్లా బూడిదపాలు!
సాలీడుకి నిప్పు పెట్టబోయి.. రూ.కోటి విల్లా బూడిదపాలు!
ఐస్‌క్రీమ్‌తో భార్యను ఆటపట్టించిన ధోనీ..సాక్షి రియాక్షన్ అదిరింది
ఐస్‌క్రీమ్‌తో భార్యను ఆటపట్టించిన ధోనీ..సాక్షి రియాక్షన్ అదిరింది
బొబ్బిలి కోటలో నాటి శౌర్యానికి నీరాజనం
బొబ్బిలి కోటలో నాటి శౌర్యానికి నీరాజనం
ఆకులే బంగారం.. దసరా రోజున జమ్మి పూజ ఎందుకు చేస్తారు..?
ఆకులే బంగారం.. దసరా రోజున జమ్మి పూజ ఎందుకు చేస్తారు..?
ఏటీఎం మెషిన్‌లో మెటల్ బటన్లు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు..?
ఏటీఎం మెషిన్‌లో మెటల్ బటన్లు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు..?
పండగకు ముందే మేకను కోసి మటన్ విందు చేసుకున్నారు.. కట్‌చేస్తే..
పండగకు ముందే మేకను కోసి మటన్ విందు చేసుకున్నారు.. కట్‌చేస్తే..