
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటేస్ట్ సినిమా లియో. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో త్రిష విజయ్ జోడిగా నటించింది. అడియన్స్ అంచనాలకు మించి ఈ సినిమాను రూపొందించాడు డైరెక్టర్ లోకేష్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనిపించాడు. థియోటర్లలో సక్సెస్ అయిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా దక్షిణాది భాషలతోపాటు.. హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఇంగ్లీష్ వెర్షన్ డబ్బింగ్ పనులు ఆలస్యం కావడంతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. తాజాగా రెండు వారాలు ఆలస్యంగా మంగళవారం ఇంగ్లీష్ వెర్షన్ ఓటీటీలోకి తీసుకువచ్చారు.
ఓవర్సీస్ తోపాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ డిమాండ్ మేరకే లియో సినిమా ఇంగ్లీష్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసినట్లు సమాచారం. కాంతార తర్వాత ఓటీటీలో ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ అయిన సౌత్ మూవీగా లియో నిలిచింది. అంతకు ముందు వచ్చిన కాంతార సైతం నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కావడం గమనార్హం. లియో సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు రూ.600 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా..ఇప్పటివరకు విజయ్ నటించిన అన్ని చిత్రాల్లో హయ్యేస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది లియో.
🎶Anbenum ayudham dhane, Oru veeran nenjame🎶 pic.twitter.com/km4R6QNqLN
— Netflix India South (@Netflix_INSouth) December 6, 2023
దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత విజయ్, త్రిష జోడిగా నటించారు. ఈ సినిమాకు దాదాపు రూ.100 కోట్ల వరకు దళపతి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపించింది. ఇక లియో సక్సెస్ తర్వాత అటు త్రిష సైతం పారితోషికాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తమిళ్ ఇండస్ట్రీలో మళ్లీ ఆఫర్స్ క్యూ కట్టాయి.
The Bloody Sweet moments that went behind the making of this Badass adventure! 🔥🦁#Leo is now streaming on Netflix in India in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi. Coming soon in English.#LeoOnNetflix pic.twitter.com/yU1O7zvXVA
— Netflix India South (@Netflix_INSouth) December 5, 2023
#LEO ENGLISH dubbed Version now Streaming on #Netflix. @actorvijay @NetflixIndia @7screenstudio #LeoOnNetflix #ThalapathyVijay #Thalapathy68 pic.twitter.com/KviN2a7GBW
— Lets Cinema (Parody) (@VijayVeriyan007) December 12, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.