
వెండితెరపై మూకీ చిత్రాల యుగం ఎప్పుడో ముగిసింది. అప్పుడెప్పుడో కమల్ హాసన్ పుష్పక విమానం సైలెంట్ సినిమాగా ఆడియెన్స్ మెప్పు పొందింది. అయితే ఇప్పుడు ఇదే తరహాలో ఎలాంటి డైలాగులు లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్, మ్యూజిక్, ఎమోషన్స్‌తోనే ఓ సినిమా వచ్చింది. ఇందులో కోలీవుడ్ స్టార్స్ విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ ప్రధాన పాత్రల్లో నటించారు. జనవరి 30న థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ అని రివ్యూలు వచ్చాయి. సినిమా మొత్తంలో ఎలాంటి డైలాగులు లేనప్పటికీ ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పోశారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం (ఫిబ్రవరి 28) అర్ధరాత్రి నుంచి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.
కిశోర్ పాండురంగ్ తెరకెక్కించిన గాంధీ టాక్స్ సినిమాలో మహేశ్ మంజ్రేకర్, సిద్దార్థ్ జాదవ్, జరీనా వహాబ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, క్యూరియస్ మూవీ మిల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. సినిమాలో ఎలాంటి డైలాగ్స్ ఉండవు. కేవలం ఎక్స్‌ప్రెషన్స్, మ్యూజిక్, ఎమోషన్స్‌తోనే మూవీ మొత్తం నడిపించారు. కాబట్టి భాషతో సంబంధం లేకుండా గాంధీ టాక్స్ సినిమాను చూడొచ్చు. అయితే ఇంగ్లిష్ లో సబ్‌టైటిల్స్ ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా కేవలం రెంటల విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే సినిమా చూడాలంటే రూ. 279 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే త్వరలోనే ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
#VijaySethupathis experimental silent film #GandhiTalks is now streaming (Rent) on @PrimeVideoIN
#GandhiTalksOnPrime @VijaySethuOffl #VJS #ArvindSwamy #AditiRaoHydari #ARR pic.twitter.com/QIed2f9yVn
— Cine Probe🍿 (@Movie_fly) February 27, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.