Operation Valentine OTT: సడెన్‏గా ఓటీటీలోకి వచ్చేసిన ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే..

|

Mar 22, 2024 | 2:53 PM

మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమలో పూర్తి స్థాయిలో వచ్చిన ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ డ్రామా ఇదే.. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూ అందుకుంది. ఇందులో వరుణ్ జోడిగా మానుషి చిల్లర్ కథానాయికగా నటించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదు. పుల్వామా అటాక్, బాలాకోట్ వైమానిక దాడులు ఆధారంగా చేసుకుని ఈ డ్రామాను రూపొందించారు.

Operation Valentine OTT: సడెన్‏గా ఓటీటీలోకి వచ్చేసిన ఆపరేషన్ వాలెంటైన్.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే..
Operation Valentine Movie
Follow us on

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 1న విడుదల చేశారు. విడుదలకు ముందే జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి అతిథిగా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు. మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమలో పూర్తి స్థాయిలో వచ్చిన ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ డ్రామా ఇదే.. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూ అందుకుంది. ఇందులో వరుణ్ జోడిగా మానుషి చిల్లర్ కథానాయికగా నటించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదు. పుల్వామా అటాక్, బాలాకోట్ వైమానిక దాడులు ఆధారంగా చేసుకుని ఈ డ్రామాను రూపొందించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లోనూ ఈ చిత్రానికి జోరుగా ప్రచారం చేశారు. కానీ అప్పటికే హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ విడుదల కావడంతో ఈ చిత్రాన్ని ఆ సినిమాతో పోల్చారు.

ఈ రెండు సినిమాలు వైమానాకి దాడులు.. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంతో తెరకెక్కినవే. అంతేకాకుండా ఫైటర్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్ కంటే ముందే రిలీజ్ కావడంతో ఈ సినిమాకు అడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. థియేటర్లలో అంతగా సక్సెస్ కాలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, తమిళంలోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈసినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందు ఎలాంటి ప్రచారాలు జరగలేదు. ఇన్నాళ్లు థియేటర్లలో మిస్ అయిన అడియన్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

ఈ సినిమాలో నవదీప్, రుహానీ శర్మ, పరేష్ పహుజా, షతాఫ్ ఫిగర్, సంపత్, అలీ రెజా కీలకపాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, సందీప్ ముద్దా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం వరుణ్ మట్కా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.