నేను అడిగెడితే.. షో మొదలెడితే.. ఏమవువ్వుద్దో చేసి చూపించారు బాలయ్య. ఏదైనా తాను దిగనంతవరకే.. వన్స్ హీ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అన్న డైలాగ్‌ను నిజం చేసి చూపించారు. ఏజూ, గేజూ అన్ని బారియర్లూ తెగ్గొట్టేసి దూసుకుపోతున్నారు. బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 2 దుమ్మురేపుతుంది. దెబ్బకు థింకింగ్ మారిపోతోందక్కడ. లేదంటే ఏంటి మరి… అక్కడున్నది బాలయ్యా మజాకా..?. ఒక్కో ఎపిసోడ్.. ఒక్కో మాస్టర్ పీస్ అన్నట్లుగా సాగుతుంది. అన్‌స్టాపబుల్..! ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్..!. దీంట్లో నో డౌట్. ఆహా వాళ్లు ఏ క్షణాన ఈ టాక్ షోకు రూపకల్పన చేశారో తెలియదు కానీ.. రేటింగ్స్ మోత మోగిపోతున్నాయి. హైలెవల్ ఎనర్జెటిక్ పంచ్‌లతో న్యూ ఏజ్ ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు బాలయ్య. డాన్స్ కూడా మామాలుగా లేదు.
గెస్టులు కూడా అస్సలు ఊహకు అందడం లేదు. ప్రభాస్, గోపిచంద్ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రోమో విడుదలయ్యి విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈలోపే రొమాలు నిక్కబొడుచకునే ప్రకటన వచ్చింది. పవన్ కల్యాణ్ ఈ షోకు రాబోతున్నారు. ఇది పక్కా ఇన్ఫర్మేషన్. ఈ వార్త విన్న వెంటనే మెగా, నందమూరి అభిమానులు ఆనందానికి అవధులు లేవు. వారిద్దరూ ఏం మాట్లాడుకుంటారు. రాజకీయాల ప్రస్తావన ఉంటుందా…? ఇద్దరు కలిసి సినిమా చేయడానికి ఒప్పుకుంటారా..? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు.
తాజాగా మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ పవర్ ప్యాక్డ్ ఎసిసోడ్ షూటింగ్ డిసెంబర్ 27న జరగనుంది. ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా కన్ఫామ్ చేశారు. పవర్ స్టార్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్, క్రిష్ జాగర్లమూడి ఈ షోలో సందడి చేయనున్నారు. దీంతో ఈ టాపిక్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరినీ చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు.
Get Ready for a smashing blast of Fireworks this 27th December ??
Stay Tuned to @ahavideoIN ✨
— Naga Vamsi (@vamsi84) December 15, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చూడండి..