నందమూరి బాలకృష్ణ యాంకర్‌గా మారిన షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఈషోలో హోస్టింగ్ అదరగొట్టేశారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఈ షో సూపర్ హిట్ అయ్యింది. ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన బాలయ్య.. ఈ షోలో తనదైన కామెడీ టైమింగ్.. పంచులతో కడుపుబ్బా నవ్వించారు బాలయ్య. ఈ షోకు టాలీవుడ్ స్టార్ హీరోస్ సైతం అతిథులుగా వచ్చి సందడి చేశారు. ఇప్పటివరకు రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’లో మూడవ ఎపిసోడ్‌కి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్వాహకులు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, సుహాసిని మణిరత్నం, శ్రియా శరన్, జయంత్ సి.పరాన్జీ మూడవ ఎపిసోడ్ అతిథులుగా వచ్చారు. ఈ నలుగురిలో ముగ్గురితో కలిసి బాలకృష్ణ పనిచేశారు. బాలకృష్ణ, సుహాసిని జంటగా అనేక సినిమాల్లో నటించారు.
అలాగే బాలయ్య, శ్రియా కలిసి ఏకంగా మూడు సినిమాల్లో జోడి కట్టారు. ఇక జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో బాలయ్య రెండు సినిమాలు చేశారు. ఇక డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలో మాత్రం బాలయ్య ఇంకా వర్క్ చేయలేదు. కానీ ఇప్పుడు అన్ స్టాపబుల్ షోలో వీరిద్దరూ తమ కామెడీ పంచులతో నవ్వులు పూయించారు. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌పై బాలకృష్ణ తనదైన స్టైల్లో పంచులను విసిరి స్టేజ్‌పై నవ్వులను పూయించారు. ఎప్పుడూ సీరియస్ గా కనిపించే హరీష్ శంకర్.. ఈ షోలో మాత్రం బాలయ్యతో కలిసి ఫన్ క్రియేట్ చేశారు.
FUN lo FILTER undadhu.. Entertainment lo thaggedhi undadhu! 😎🔥#UnstoppableWithNBKOnAha Episode 3 premieres on December 22 !
Watch Promo📷https://t.co/hywDUvORjB#NBKOnAHA #NBK #NandamuriBalakrishna @harish2you @shriya1109 @hasinimani @jayanthparanji #MansionHouse… pic.twitter.com/MYRTKbnuFG
— ahavideoin (@ahavideoIN) December 14, 2023
అనంతరం బాలకృష్ణతో సుహాసిని, శ్రియాశరన్ డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. చెన్న కేశవ రెడ్డి సినిమాలోని హాయి హాయి పాటకు శ్రియా, బాలయ్య కలిసి స్టెప్పులేసి.. ఆరోజులను గుర్తుచేశారు. జయంత్ సి.పరాన్జీ ఎపిసోడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఎక్స్‌ట్రా డోస్‌ను పెంచారు. ఇక ఎప్పటిలాగా అతిథులను బాలయ్య ప్రశ్నలు వేయడం కాకుండా.. ఈ నలుగురు కలిసి బాలకృష్ణపై ప్రశ్నలు కురిపించారు. డిసెంబర్ 22న ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఎపిసోడ్ 3 స్ట్రీమింగ్ కానుంది. కచ్చితంగా ప్రేక్షకులకు ఈ ఎపిసోడ్ గత ఎపిసోడ్స్ తరహాలోనే అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనుందనటంలో సందేహం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.