అజ్ఞాత వీరుల అద్భుతమైన కథతో “భారత్ భాగ్య విధాత”.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 26/11 ఉగ్రవాద దాడుల సమయంలో ధైర్యంగా నిలబడిన అజ్ఞాత వీరుల అద్భుతమైన కథతో తెరకెక్కిన ‘భారత్ భాగ్య విధాత’ను అందిస్తోన్న జీ5 హిందీ. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తుంది.

అజ్ఞాత వీరుల అద్భుతమైన కథతో భారత్ భాగ్య విధాత.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే
Bharat Bhagya Vidhata

Updated on: Aug 08, 2026 | 12:20 PM

కంగనా రనౌత్, గిరిజా ఓక్, స్మిత తాంబే నటించిన భారత్ భాగ్య విధాత సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ధైర్యం, స్థైర్యం, నిస్వార్థ సేవలోని స్ఫూర్తిని చాటిచెప్పేందుకు ఆగస్టు 14న భారత్ భాగ్య విధాత ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌తో హిందీ జీ 5 ప్రేక్షకులను ఆహ్వానిస్తోంది. భారతదేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు సాహసోపేతమైన, స్ఫూర్తిదాయకమైన, సాంస్కృతికంగా ప్రతిధ్వనించే కథలను అందించాలనే తన నిబద్ధతను కొనసాగిస్తూ ఈ స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దేశాన్ని నిర్వచించే విలువలను ప్రతిబింబించే అసాధారణ ధైర్యసాహసాలు కలిగిన అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకు వస్తుంది. మనోజ్ తపడియా రచన, దర్శకత్వంలో పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస్ క్రియేషన్స్, యూనోయా ఫిల్మ్స్ LLP, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో నిర్మించిన ‘భారత్ భాగ్య విధాత’ చిత్రంలో కంగనా రనౌత్‌తో పాటు గిరిజ ఓక్, స్మిత తాంబే తదితరులు నటించారు.

26/11 ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో, భారతదేశ చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటైన ఆ కాలాన్ని ఈ చిత్రం తిరిగి గుర్తు చేస్తుంది. తమ ధైర్యసాహసాలు, నిస్వార్థతతో లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడిన ఒక వీరుల బృందాన్ని ఈ చిత్రం వెలుగులోకి తీసుకుస్తుంది. ముంబైలోని కామా, అల్బ్లెస్ ఆసుపత్రి నేపథ్యంలో సాగే ఈ చిత్రం తమ సంరక్షణలో ఉన్న రోగులకు ప్రథమ రక్షణగా నిలిచిన నర్సులు, వార్డ్ బాయ్‌లు, క్లీనర్లు, భద్రతా సిబ్బంది, ఇతర ఆసుపత్రి సిబ్బంది అసాధారణమైన చర్యలను అనుసరిస్తుంది.

నటి, నిర్మాత కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ‘కొన్ని కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఎందుకంటే అవి ప్రపంచానికి తెలియాల్సినవి. ‘భారత్ భాగ్య విధాత’ అటువంటి చిత్రమే. 26/11 దాడుల సమయంలో ఉగ్రవాదానికి, మానవత్వానికి మధ్య ధైర్యంగా నిలిచిన ఆరోగ్య కార్యకర్తల వెలుగు చూడని కథలను తెరపైకి తీసుకురావడం నటిగానూ, నిర్మాతగానూ నాకు ఎంతో ముఖ్యమైన విషయం. వారి ధైర్యానికి గుర్తింపు పొందాలనే ఆశ కారణం కాదు, వారి అచంచలమైన కర్తవ్య దీక్ష, మానవతా దృక్పథమే దానికి మూలం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం దీని సందేశానికి మరింత అర్థాన్ని చేకూరుస్తుంది; ఎందుకంటే, సరిహద్దుల్లో దేశాన్ని రక్షించేవారే కాకుండా, సంక్షోభ సమయాల్లో అసాధారణ సవాళ్లను ఎదుర్కొనే సామాన్య పౌరులు కూడా భారత స్ఫూర్తికి ప్రతీకలని ఇది మనకు గుర్తుచేస్తుంది. ‘జీ5’ (Zee5)లో ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకులు వారి త్యాగాలతో మమేకమవుతారని, అలాగే ఈ కథకు స్ఫూర్తినిచ్చిన ఎంతోమంది నిజ జీవిత వీరులను గుర్తుచేసుకుంటారని నేను ఆశిస్తున్నాను’ అని అన్నారు. భారత్ భాగ్య విధాత ఆగష్టు 14, 2026న హిందీ జీ 5లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us