OTT Movies: నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ చిత్రాలు ఇవే.. స్ట్రీమింగ్‏కు వచ్చేసిన మూడు సినిమాలు..

|

Jan 04, 2024 | 10:46 AM

ఇక ఇప్పుడు భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఓటీటీలోనూ సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే పలు సూపర్ హిట్స్ డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, మరెన్నో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్స్ పై అనేక చిత్రాలు ప్రేక్షకులను ఆలరిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్రాలను అందిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇక ఇప్పుడు మరో మూడు సూపర్ హిట్ చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువచ్చాయి. గత అర్ద రాత్రి నుంచి ఈ మూడు చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్రీమింగ్ అవుతున్నాయి.

OTT Movies: నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ చిత్రాలు ఇవే.. స్ట్రీమింగ్‏కు వచ్చేసిన మూడు సినిమాలు..
Ott Movies
Follow us on

గతేడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఎన్నో చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలలో చిన్న సినిమాల నుంచి పెద్ద చిత్రాల వరకు ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించాయి. ఇక డబ్బింగ్ చిత్రాల గురించి చెప్పక్కర్లేదు. విడుదలైన అన్ని భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ఓటీటీలోనూ సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే పలు సూపర్ హిట్స్ డిజిటల్ ప్లాట్ ఫాంపై సందడి చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, మరెన్నో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్స్ పై అనేక చిత్రాలు ప్రేక్షకులను ఆలరిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్రాలను అందిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇక ఇప్పుడు మరో మూడు సూపర్ హిట్ చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువచ్చాయి. గత అర్ద రాత్రి నుంచి ఈ మూడు చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ అవెంటో తెలుసుకుందామా.

1. హాయ్ నాన్న..
న్యాచురల్ స్టార్ నాని, కొత్త దర్శకుడు శౌర్యువ్ కాంబోలో వచ్చిన చిత్రం హాయ్ నాన్న. డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తండ్రికూతురు అనుబంధం.. అందమైన ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది ఈమూవీ స్టోరీ. అలాగే హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

2. జిగర్తండా డబుల్ ఎక్స్..
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో లారెన్స్ రాఘవ, ఎస్జే సూర్య కలిసి నటించిన సినిమా జిగర్తండా డబుల్ ఎక్స్. గతంలో సూపర్ హిట్ అయిన జిగర్తండా చిత్రానికి సీక్వెల్ ఇది. ఒక సీక్రెట్ పోలీస్ ఆఫీసర్, గ్యాంగ్‌స్టర్ చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. వీరిద్దరు అనుకోకుండా కలుసుకోవడం.. తర్వాత వీరి జీవితం ఎలా మలుపు తిప్పింది అనేది సినిమా. ఈ చిత్రానికి బలమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ మూవీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

3. అన్నపూర్ణి..
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమా అన్నపూర్ణి. డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక మహిళ చెఫ్ కావాలనే తన కలను చేరుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చిందనేది సినిమా. ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈసినిమాను ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.