AHA OTT: మరో సరికొత్త చరిత్రకు నాంది పలికిన ఆహా.. ‘తెలుగు ఇండియన్‌ ఐడల్‌’తో ప్రేక్షకుల ముందుకు..

|

Dec 16, 2021 | 11:26 PM

AHA Indian Idol: 'ఆహా' ఓటీటీ గురించి సదరు తెలుగు ప్రేక్షకుడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలి తెలుగు ఓటీటీ సంస్థగా అడుగు పెట్టిన 'ఆహా' అనతి కాలంలోనే అత్యున్నత స్థానానికి..

AHA OTT: మరో సరికొత్త చరిత్రకు నాంది పలికిన ఆహా.. తెలుగు ఇండియన్‌ ఐడల్‌తో ప్రేక్షకుల ముందుకు..
Aha Ott
Follow us on

AHA Indian Idol: ‘ఆహా’ ఓటీటీ గురించి సదరు తెలుగు ప్రేక్షకుడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలి తెలుగు ఓటీటీ సంస్థగా అడుగు పెట్టిన ‘ఆహా’ అనతి కాలంలోనే అత్యున్నత స్థానానికి చేరుకుంది. మొదలైన కొంత కాలంలోనే అత్యధిక డౌన్‌లోడ్స్‌తో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడి అభిరుచికి అనుగుణంగా కంటెంట్‌ను అందిస్తోంది కాబట్టే ఈ ఓటీటీకి ఇంత ఆదరణ పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం. కేవలం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు మాత్రమే పరిమితం కాకుండా టాక్‌ షోలతో డిజిటల్‌ వ్యూవర్స్‌కి సరికొత్త అనుభూతిని పరిచయం చేసిందీ ఓటీటీ. ఇక తాజాగా మరో సంచలనానికి తెర తీసింది ఆహా.

ఇండియన్‌ ఐడల్‌ అంటే మనకు ఇప్పటి వరకు తెలిసింది హిందీలో జరిగే సింగింగ్‌ రియాలిటీ షోనే. కానీ ఆహా త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్‌ షోను పరిచయం చేయనుంది. ఈ విషయమై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేశారు. తెలుగు సింగింగ్‌ ట్యాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోను ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఆడిషన్స్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించారు. డిసెంబర్‌ 26న తొలి ఆడిషన్స్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న గాయనీగాయకులకు ఆహ్వానం అందించారు. ఇక ఈ ఆడిషన్స్‌ హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌లో ఆడిషన్స్‌ను నిర్వహించనున్నారు. మరెందుకు ఆలస్యం ఆహా వేదికగా మీ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పండి, ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి.

Also Read: Shamna Kasim: ఒంపు సొంపులతో కవ్విస్తున్న సీమటపాకాయ్ చిన్నది..

ట్రెక్కింగ్ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి తెలుసా..

ట్రెక్కింగ్ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి తెలుసా..