
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సూపర్ హిట్ అయిన సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్. ఎంతో టాలెంట్ ఉండి నిరూపించుకోవడానికి ఒక వేదిక కోసం ఎదురుచూసే యంగ్ సింగర్స్ కోసం ఈ షోను తీసుకువచ్చారు నిర్వాహకులు. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించిన సీజన్ 1 పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కొద్ది రోజుల క్రితం ఈ షో సీజన్ 2 ప్రారంభమైంది. అయితే ఈసారి హోస్ట్ గా సింగర్ హేమచంద్ర కనిపిస్తున్నాడు. అలాగే జడ్జీగా నిత్యా మీనన్ స్థానంలో సింగర్ గీతామాధురి చేరింది. ఇప్పటికే ఆడిషన్స్ జరుపుకుంటున్నతెలుగు ఇండియన్ ఐడల్ షో మార్చి 3 నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం ఏడు గంటలకు ప్రీమియర్ కానుంది. ఇటీవల విడుదలైన ప్రోమోలో బీఎఫ్ఎస్ జవాన్ చక్రపాణి నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలోని ఘల్ ఘల్ పాటను అద్భుతంగా ఆలపించి మెప్పించారు. ఇక ఇప్పుడు మరో యంగెస్ట్ సింగర్ కార్తికేయ ప్రోమో రిలీజ్ చేశారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. యంగెస్ట్ కార్తికేయ ఎంట్రీ ఇచ్చాడు. స్కూల్ స్టడీ చేస్తున్న కార్తికేయకు సింగింగ్ అంటే ప్రాణం. తెలుగు ఇండియన్ ఐడల్ వేదికపై సూపర్ హిడ్ చిత్రం కడలి సినిమాలోని యాడికే.. యాడికే నన్ను తీసుకెళ్తావ్ నీతో పాటే.. పాటను అద్భుతంగా ఆలపించి మైమరపించాడు. కార్తికేయ గొంతుకు.. పాడిన విధానానికి జడ్జీస్ ఫిదా అయ్యారు. అనంతరం ఫస్ట్ సీజన్ సింగర్ వైష్ణవి ఎంట్రీ ఇవ్వగా.. కార్తికేయతోపాటు అందంగా పాడి మెప్పించారు. మొదటి రెండు ఎపిసోడ్స్ శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కానున్నాయి.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఆడిషన్ రౌండ్ లో అదరగొట్టిన యంగెస్ట్ సింగర్ కార్తికేయ…
మొదటి రెండు ఎపిసోడ్స్ ఈ శుక్ర, శనివారం రాత్రి 7 గంటలకు.. దునియాని దున్నేయబోయే టాలెంట్ ని మిస్ అవ్వకండి… #TeluguIndianIdol2 మీ ఆహాలో!@MusicThaman @singer_karthik @geethasinger @itsvedhem pic.twitter.com/r5jE0lmrNc— ahavideoin (@ahavideoIN) March 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.