Super Deluxe: తెలుగు ఆడియన్స్‌ కోరిక మేరకు తెలుగులో సూపర్‌ డీలక్స్‌.. ట్రైలర్‌ చూశారా? ఆహాలో ఎప్పటి నుంచంటే.

Super Deluxe: తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది ఆహా ఓటీటీ. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు మాత్రమే పరిమితం కాకుండా...

Super Deluxe: తెలుగు ఆడియన్స్‌ కోరిక మేరకు తెలుగులో సూపర్‌ డీలక్స్‌.. ట్రైలర్‌ చూశారా? ఆహాలో ఎప్పటి నుంచంటే.
Super Deluxe Trailor

Updated on: Aug 03, 2021 | 8:38 PM

Super Deluxe: తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది ఆహా ఓటీటీ. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు మాత్రమే పరిమితం కాకుండా సరికొత్త టాక్‌ షోలతో ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడికి నాంది పలికింది. రోజురోజుకూ యూజర్లను పెంచుకుంటూ పోతున్న ‘ఆహా’. తాజాగా తెలుగు ప్రేక్షకులకు ఇతర భాషల్లో విడుదలైన చిత్రాలను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న చిత్రమే ‘సూపర్‌ డీలక్స్‌’. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగు ఆడియన్స్‌ కోసం ‘ఆహా’ డబ్బింగ్‌ చేసి విడుదల చేయనుంది.

గత కొన్ని రోజులుగా తెలుగు ఆడియన్స్‌ నుంచి వస్తోన్న విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సినిమా ప్రకటన సందర్భంగా ‘ఆహా’ ట్వీట్ చేసింది. విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సమంతతో పాటు తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. నలుగురు వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలకు దృశ్య రూపమే ఈ సినిమా. అత్యంత సహజమైన సన్నివేశాలతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. మరి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: Nayattu Remake: మలయాళ సినిమాపై కన్నేసిన గీతా ఆర్ట్స్‌.. పొలిటికల్‌ థ్రిల్లర్‌ను రీమేక్‌ చేసే పనిలో పడ్డ అల్లు అరవింద్‌.

స్వర్గంలో ‘రంభ’ ఈ అందాల ముద్దుగుమ్మ..! భలే అవకాశం కొట్టేసిన గ్లామర్ బ్యూటీ..

Pushpa Movie: ఫ్యాన్స్ సిద్దంకండి.. పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన చిత్రయూనిట్