Samajavaragamana: పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేందుకు రెడీనా? ఓటీటీలోకి సామజవరగమన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రెబా మోనికా జాన్‌ హీరోయిన్‌గా నటించింది. శ్రీవిష్ణు తండ్రిగా నరేష్‌ కీలక పాత్రలో నటించారు. ఏ మాత్రం హడావిడి లేకుండా జూన్‌ 29న థియేటర్లలో విడుదలైన సామజవరగమన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది

Samajavaragamana: పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేందుకు రెడీనా? ఓటీటీలోకి సామజవరగమన.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Samajavaragamana Movie

Updated on: Jul 16, 2023 | 6:16 PM

యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రెబా మోనికా జాన్‌ హీరోయిన్‌గా నటించింది. శ్రీవిష్ణు తండ్రిగా నరేష్‌ కీలక పాత్రలో నటించారు. ఏ మాత్రం హడావిడి లేకుండా జూన్‌ 29న థియేటర్లలో విడుదలైన సామజవరగమన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తండ్రీ కొడుకులుగా నరేష్‌, శ్రీ విష్ణుల కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలు ఈ చిన్న సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సుమారు రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సామజవరగమన ఏకంగా రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సామజవరగమన ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సామజవరగమన డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తాజాగా శ్రీ విష్ణు సినిమా ఓటీటీ రిలీజ్‌పై కీ అప్డేట్‌ ఇచ్చింది.

‘పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేందుకు రెడీగా ఉండండి. ఈ సీజన్‌ బ్లాక్‌ బస్టర్‌ సామజవరగమన సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది’ అని ఆహా టీమ్ ట్వీట్‌ చేసింది. అయితే సినిమా ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులో ఉండనుందనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రాజేష్ దండా సామజవరగమన చిత్రాన్ని నిర్మించారు. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్‌, ప్రియ కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us