సాధారణంగా హారర్ కంటెంట్ చూసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అదే హారర్ కంటెంట్ చిత్రాలకు కాస్త కామెడీ తోడైతే సినీ ప్రియులకు మరింత ఎంటరైన్మెంట్ . ఇటీవల కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, హారర్ కంటెంట్ ఓటీటీ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. హారర్ కామెడీ చిత్రాలకు రోజు రోజుకు ఆదరణ ఎక్కువవుతుంది. ముఖ్యంగా ఓటీటీలో ఇలాంటి కథలకు మంచి డిమాండ్ ఉంది. తాజాగా అలాంటి ఓ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు వస్తుంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషించారు. హారర్ కామెడీ కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు మరాటీ డైరెక్టర్ ఆదిత్య సర్పోట్ దర్ దర్శకత్వం వహించారు. ఇందులో సాక్విబ్ సలీమ్ కీలకపాత్ర పోషించాడు.
ఇప్పుడు ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ విషయాన్ని వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం ఈసినిమాను జూలై 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా షేర్ చేసిన పోస్టర్ చూస్తుంటే దెయ్యం ప్రధాన అంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సోనాక్షి సిన్హా బాలీవుడ్ మాత్రమే కాకుండా సౌత్ అడియన్స్ కు కూడా సుపరిచితమే. ఇటీవల హిరామండి వెబ్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా సినీ ప్రియులకు దగ్గరయ్యింది సోనాక్షి. ఇటీవలే తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలోని రాటోడి అనే చిన్న గ్రామంలో జరిగే కథగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. గ్రామం మొత్తానికి ప్రతి ఇంట్లో రెండు గదులు ఉంటాయి. అందులో ఒకటి పెద్ద గది.. మరోకటి చిన్నది. రోజువారీ ఆచారం ప్రకారం చిన్న గది తలుపులు ప్రతి మంగళవారం రాత్రి 7.15 గంటలకు తెరవబడుతుంది. ఒకవేళ అలా జరగకపోతే ఆ ఇంటి మనిషి కాకుడి అనే దెయ్యం ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. ఆ దెయ్యం కేవలం పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది. అసలు కాకుడి ఎవరు.. ? ఆ గ్రామంలో ఏం జరుగుతుంది ? అనేది కాకుడి సినిమా.
Purushon Ke Hit Mein Jaari ⚠️- #Kakuda aa raha hai ‘12 July’ ko, toh ghar pe rahein aur theek 7:15 baje, darwaza khula rakhna naa bhoolein. 👻
Kyunki #AbMardKhatreMeinHai, #Kakuda only on #ZEE5#KakudaOnZEE5 pic.twitter.com/wzHOVtE4j8
— ZEE5 (@ZEE5India) June 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.